రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్‌తోపాటు లోకో పైలెట్, ఆర్ఫీఎఫ్ ఎస్సై, టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. రైల్వేలో వివిధ కేడర్లలో 7,951 పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా ప్రకటించిన తేదీలకు సంబంధించి వివరాలను పరిశీలిస్తే.. జూనియర్ ఇంజనీర్ పరీక్ష సీబీటీ-1ను డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ 13 వరకు నిర్వహించనున్నారు.
ఇండియన్ రైల్వే
రైల్వేశాఖలోని పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్‌ను రైల్వే బోర్డు విడుదల చేసింది. లక్షలాది మంది అభ్యర్థులు వివిధ కేటగిరీల్లో నిర్వహంచనున్న పరీక్షలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా రైల్వే బోర్డు ఆయా కేటగిరీల్లోని పరీక్షలు నిర్వహణకు సంబంధించిన తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం రైల్వే బోర్డు విడుదల చేసింది. రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్‌తోపాటు లోకో పైలెట్, ఆర్ఫీఎఫ్ ఎస్సై, టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన పరీక్షా తేదీలను ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. రైల్వేలో వివిధ కేడర్లలో 7,951 పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా ప్రకటించిన తేదీలకు సంబంధించి వివరాలను పరిశీలిస్తే.. జూనియర్ ఇంజనీర్ పరీక్ష సీబీటీ-1ను డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ 13 వరకు నిర్వహించనున్నారు. అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులకు నవంబర్ 25 నుంచి 29 మధ్య సీబీటీ-1 పరీక్ష నిర్వహించనున్నారు.
ఆర్పీఎప్ ఎస్సై పోస్టులకు డిసెంబర్ రెండో తేదీ నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ పోస్టులకు డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు షెడ్యూల్ విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌బీ జేఈ పోస్టులు భర్తీకి రైల్వేశాఖ జూలై 30 వరకు దరఖాస్తులను స్వీకరించింది. సెప్టెంబర్ ఎనిమిదో తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఆర్‌ఆర్‌బీ జేఈ పరీక్ష రెండు దశల్లో సీబీటీ-1, సీబీటీ-2గా జరగనుంది. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి షార్ట్‌లిస్ట్ చేసిన తరువాత అభ్యలందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఉద్యోగాలు కల్పించనున్నారు. ఆయా పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తేదీల విషయంలో అవగాహనతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో రైల్వేశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్ విడుదల కానుందని చెబుతున్నారు.