సీతాఫలం ముఖ్యంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సీతాఫలం మహిళల గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. రక్తంలో షుగర్ ను బాగా కంట్రోల్ చేస్తుంది. సీతాఫలంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీపీని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఈ పండులోని ఫైబర్, పోషకాలు కారణంగా ఒత్తిడిని తగ్గిస్తుంది.
సీతాఫలం పండు
సీతాఫలం.. ఈ పండులో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉండడంతోపాటు పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఎక్కువగా వర్షాకాలం, శీతాకాలం మధ్యలో లభించే ఈ పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్న మాట. ప్రతిరోజు ఒక పండు తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు చెక్ చెప్పేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
సీతాఫలం ముఖ్యంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సీతాఫలం మహిళల గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. రక్తంలో షుగర్ ను బాగా కంట్రోల్ చేస్తుంది. సీతాఫలంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీపీని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఈ పండులోని ఫైబర్, పోషకాలు కారణంగా ఒత్తిడిని తగ్గిస్తుంది. మహిళల చర్మానికి నిగారింపు ఇచ్చే పదార్థాలు ఈ పండులో ఉంటాయి. వైద్య గుణాల వల్ల ఈ పండు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సీతాఫలం శరీరానికి శక్తిని అందిస్తూ అలసటను తగ్గిస్తుంది. సీతాఫలంలో ఉండే విటమిన్ ఏ కంటికి ఆరోగ్యకరమైనది. సీతాఫలంలో కాల్షియం, ఫాస్ఫరస్ బాగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఒక పండును తీసుకోవడం వల్ల మహిళలు ఈ తరహా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు
పురుషులతోపాటు పిల్లల ఆరోగ్యానికి ఈ పండుతో మేలు..
సీతాఫలాన్ని రోజు తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. సీతాఫలం అధిక కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటుంది. సాధారణ ఫ్రక్టోజ్, గ్లూకోజులు ఉంటాయి. వీటిని శరీరం సులభంగా విచ్చనం చేస్తుంది. శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. సీతాఫలంలో ఇనుము కూడా ఉంటుంది. ఇది రక్తహీనతను నయం చేస్తుంది. మధుమేహాన్ని పూర్తిగా నియంత్రిస్తుంది. సీతాఫలం తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న పండు. అదే సమయంలో అనేక చర్మవ్యాధులను నయం చేయడంలో సీతాఫలం పండు కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ పండులోని విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సి, జింక్, కాపర్ వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు చర్మాన్ని సుసంపన్నం చేసే పోషకాల నిధిగా ఉంటాయి. అసంతృప్త కొవ్వులు, ఆరోగ్యకరమైన ఒమేగా - 6 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న సీతాఫలం పండు హృదయనాల పరిస్థితులను నివారించడం ద్వారా గుండె ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్ సీతాఫల్ లో టన్నులు కొద్ది ఫ్లావనాయిడ్లు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మంటను నివారించడం, తగ్గించడం, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో కీలకంగా ఈ పండు పని చేస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్ బి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నరాల సిగ్నలింగ్ ఏకాగ్రతను పెంచడం వంటి ప్రక్రియలు సరైన పనితీరును కొనసాగించడానికి మెదడును ప్రేరేపిస్తుంది. సీతాఫలం నుంచి కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏతోపాటు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఈ పోషకాలు శరీరంలో రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడతాయి. కంటి చూపును పెంచుతుంది. వయసు సంబంధిత మచ్చల క్షీణత, కంటి శుక్లాం, గ్లకోమాను అభివృద్ధి చేసే అవకాశాన్ని ఆలస్యం చేయడం లేదా తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఎముకలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఈ పండులోని కొన్ని రకాల ఫ్లావనాయిడ్లు, విటమిన్లు దోహదం చేస్తాయి. గాయాలను నయం చేయడంలో విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో ఈ పండు కీలకంగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.