కోల్ కతాలోని ఆర్జి కర్ మెడికల్ ఆసుపత్రిలో గత నెల 9వ తేదీన వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నది పోలీసు వాలంటీర్ అని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ కేసులో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై సిబిఐ అభియోగాలను మోపింది. ఈ వ్యవహారం కేసులో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో కేసుకు సంబంధించిన కీలక పురోగతిగా కూడా దీనిని భావిస్తున్నారు.
సందీప్ ఘోష్
కోల్ కతాలోని ఆర్జి కర్ మెడికల్ ఆసుపత్రిలో గత నెల 9వ తేదీన వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నది పోలీసు వాలంటీర్ అని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ కేసులో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై సిబిఐ అభియోగాలను మోపింది. ఈ వ్యవహారం కేసులో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో కేసుకు సంబంధించిన కీలక పురోగతిగా కూడా దీనిని భావిస్తున్నారు. ఈ కేసు విచారణను చేపట్టిన సిబిఐ ఈనెల 17వ తేదీ నాటికి హైకోర్టుకు నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే సిబిఐ అధికారులు మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను మరోసారి అరెస్టు చేసింది. ఆయనపై హత్యాచారం అభియోగాలను నమోదు చేసింది. సాక్షాదారాల ధ్వంసంతో పాటు విచారణను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. వీటితో పాటు ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం చేసినందుకు కేసును తొలత విచారించిన తలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను కూడా సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కేసుకు సంబంధించిన విచారణ దాదాపు కొలిక్కి వచ్చినట్లు అంతా భావిస్తున్నారు. కీలకమైన ఆధారాలు లభించడం వల్లే సిబిఐ అధికారులు మరోసారి ప్రిన్సిపాల్ తోపాటు పోలీస్ అధికారిని అరెస్టు చేశారని చెబుతున్నారు.
శనివారం మధ్యాహ్నం ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద గడిచిన నెల రోజులుగా నిరసన దీక్ష చేపడుతున్న జూనియర్ వైద్యులతో చర్చలు జరిపేందుకు వచ్చిన సీఎం మమతా బెనర్జీ.. వైద్యులను విధుల్లోకి రావాలని కోరారు. అయితే ముఖ్యమంత్రి విజ్ఞప్తిని వైద్యులు తిరస్కరించారు. బాధిత వైద్య విద్యార్థినికి న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఎం మమతా బెనర్జీ వెళ్లిన కొద్ది గంటల్లోనే అంటే శనివారం రాత్రి ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. మెడికోపై అత్యాచారం కేసులో సందీప్ ఘోష్ ఇప్పటికే సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక అవకతవకులకు సంబంధించిన ఆరోపణలపై ఆయనను దర్యాప్తు సంస్థ అరెస్టు కూడా చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా అరెస్టు చేసి అత్యాచారం అభియోగాలను మోపింది. ఈ కేసులో భావిస్తున్న పోలీసు వాలంటీర్ సంజయ్ రాయ్ ను సిబిఐ అరెస్టు చేసింది. అతడికి పాలిగ్రాఫ్ పరీక్షను కూడా నిర్వహించింది. నార్కో టెస్ట్ చేయాలనుకున్న అతడు ఒప్పుకోకపోవడంతో సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై సిబిఐ అధికారులు అత్యాచారం అభియోగాలను మోపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటన జరిగిన తొలి రోజు నుంచి ప్రిన్సిపాల్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగిన తరువాత ఆయన వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు కారణమైంది. అత్యాచారం జరిగిన సెమినార్ హాలులోకి బాధితురాలు తల్లిదండ్రులను వెళ్ళనీయకుండా చేయడం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఘటన తర్వాత అభివృద్ధి పనులు పేరుతో ఆధారాలను తొలగించే ప్రయత్నం చేయడం వంటి వ్యవహారాలని ప్రిన్సిపాల్ ను ప్రశ్నించేలా చేశాయి. కీలక ఆధారాలను సేకరించిన తర్వాత సిబిఐ ఈ మేరకు అభియోగాలను మోపింది. చూడాలి ఈ కేసు ఎటువంటి మార్పులను తీసుకుంటుందో మరి.