తెలంగాణలోని కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శనివారం సికింద్రాబాద్ పర్యట గ్రౌండ్లో ఈ మహిళా శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా టీనేజర్లను, గ్రామీణ, పట్టణ మహిళలతో పాటు వృద్ధ మహిళలను ఒకే వేదిక మీదకు తెచ్చి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆర్థిక శక్తిపై అవగాహన కల్పించి ఆర్థిక స్వాతంత్రం తో పాటు వారిని శక్తివంతులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
తెలంగాణలోని కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శనివారం సికింద్రాబాద్ పర్యట గ్రౌండ్లో ఈ మహిళా శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా టీనేజర్లను, గ్రామీణ, పట్టణ మహిళలతో పాటు వృద్ధ మహిళలను ఒకే వేదిక మీదకు తెచ్చి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆర్థిక శక్తిపై అవగాహన కల్పించి ఆర్థిక స్వాతంత్రం తో పాటు వారిని శక్తివంతులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళలతో శనివారం సాయంత్రం పరేడు గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో 4,34,368 మహిళా సంఘాలు ఉండగా.. ఇందులో 46,85,460 మంది సభ్యులు ఉన్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కింద 1,34,992 మహిళా సంఘాలు ఉండగా.. వీటిలో 14,50,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ రెండు సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోజనాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. సర్ఫ్ పరిధిలో వ్యవసాయ ఆధారిత ఉపాధి పథకాలు అమలవుతున్నాయి. మెప్మా పరిధిలో పట్టణాల్లో వ్యాపార సంబంధిత పథకాలు అమలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పరిధిలోకి వెళ్లాయి. దీనివల్ల 33,914 సంఘాలు సెర్ప్ పరిధి నుంచి మెప్మాలోకి వెళ్లాయి. దీంతో సేర్ప్ కిందకు వచ్చేవారు పట్టణాలకు వెళ్తే వారికి పథకాలు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మెప్మా పరిధిలోని సంఘాలను సేర్ఫ్ లో విలీనం చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 5,69,360 సంఘాలు సర్ఫ్ పరిధిలోకి రాగా, 61,35,460 మంది సభ్యులు ఉన్నట్టు అయింది. దీంతో కేంద్ర రాష్ట్ర పథకాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సర్ఫు మహిళా సంఘాలకు ఒకే తీరుగా అంది ప్రయోజనం కలగనుంది. తెలంగాణలో టీనేజ్ బాలికలు 32 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి విద్య, ఉపాధి, ఆరోగ్యం, అభివృద్ధి పనుల్లో భాగస్వాములు చేయాలని బాలికల సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 15 నుంచి 18 ఏళ్ళ వయసు ఉన్న బాలికలను ఈ సంఘంలో చేర్చనున్నారు. 18 ఏళ్ల వచ్చిన తర్వాత అవసరం అనుకున్న వారు ఎస్ హెచ్ జి బృందాల్లో చేరవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు ఊరట నిచ్చేలా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. స్వయం సహాయక బృందాల నిబంధనల ప్రకారం 18 నుంచి 60 ఏళ్లలోపు వారికే ఎస్హెచ్జిల్లో సభ్యులుగా అవకాశం కల్పిస్తారు. 60000 దాటితే వారు సభ్యులుగా ఉండే అవకాశం లేదు. దీనివల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వయసు పైబడిన వారికి ఊరట కలిగించేలా కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల్లో చేరే వారి వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న వారితో వృద్ధుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది దీనివల్ల ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది వృద్ధులు ప్రయోజనం పొందనున్నారు.