వైఎస్ జగన్ చుట్టూ కోటరీ.. విజయసాయిరెడ్డి విమర్శలకు కారణం అదేనా.!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్ధులు కంటే తనతోపాటు నడిచి, తన వల్ల లబ్ధి పొందిన వాళ్ల నుంచి తీవ్ర స్థాయిలో ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కుటుంబ సభ్యులు దూరంగా వెళ్లిపోతుండడంతోపాటు మరోవైపు పార్టీలో మొన్నటి వరకు కీలక బాధ్యతలను చేపట్టిన వాళ్ళు కూడా పక్కకు తప్పుకోవడంతోపాటు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వీటిని తట్టుకుని ముందుకు వెళ్లడం జగన్మోహన్ రెడ్డికి అంతా సులభమేమీ కాదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒకవైపు సోదరి షర్మిల, మరో సోదరి సునీత కాళ్లకు చక్రాలు కట్టుకుని మరి కడప జిల్లా మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే మీడియా కూడా వారు చెప్పే మాటలను పతాక శీర్షికలో ప్రచురించాయి. వీరితోపాటు ఆయన తల్లి విజయలక్ష్మి కూడా జగన్ మోహన్ రెడ్డికి దూరంగా వెళ్లిపోయారు.

YS Jaganmohan Reddy, Vijay Sai Reddy

వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్ధులు కంటే తనతోపాటు నడిచి, తన వల్ల లబ్ధి పొందిన వాళ్ల నుంచి తీవ్ర స్థాయిలో ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కుటుంబ సభ్యులు దూరంగా వెళ్లిపోతుండడంతోపాటు మరోవైపు పార్టీలో మొన్నటి వరకు కీలక బాధ్యతలను చేపట్టిన వాళ్ళు కూడా పక్కకు తప్పుకోవడంతోపాటు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వీటిని తట్టుకుని ముందుకు వెళ్లడం జగన్మోహన్ రెడ్డికి అంతా సులభమేమీ కాదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒకవైపు సోదరి షర్మిల, మరో సోదరి సునీత కాళ్లకు చక్రాలు కట్టుకుని మరి కడప జిల్లా మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే మీడియా కూడా వారు చెప్పే మాటలను పతాక శీర్షికలో ప్రచురించాయి. వీరితోపాటు ఆయన తల్లి విజయలక్ష్మి కూడా జగన్ మోహన్ రెడ్డికి దూరంగా వెళ్లిపోయారు. ఇవన్నీ కూడా గడిచిన ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోవడానికి కారణం అయ్యాయి. ఎన్నికలు పూర్తయ్యాయి వైసిపి ప్రతిపక్షంలో కూడా నిలవలేని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాల్సిన ఎంతోమంది కీలక నాయకులు దూరంగా జరగబోతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డికి బంధువు, ప్రకాశం జిల్లాలో బలమైన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేనలో చేరిపోయారు. ఆయన తాజాగా జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి వల్ల తాను ఎంతగానో నష్టపోయానని, తన ఆస్తిని ఆయన కాజేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అటువంటి వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు పుస్తకం సామాజిక మాధ్యమాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు వైసీపీలో నెంబర్ 2 గా కొన్నేళ్లపాటు వ్యవహరించిన విజయసాయిరెడ్డి కూడా జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన కొద్ది రోజుల కిందటే రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని వ్యవసాయం చేసుకుంటానని వ్యాఖ్యానించారు. అయితే ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

విశ్వసనీయత ఉండాలంటూ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల.. తీవ్ర స్థాయిలో స్పందించారు. తనకు విశ్వసనీయత ఉంది కాబట్టే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆయన సిఐడి విచారణకు కొన్ని కేసుల నిమిత్తం హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి కీలక ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని ఆ కోటరీ వాళ్ళ తీవ్రంగా నష్టపోతున్నారంటూ ఆరోపించారు. కోటరీ వదలదు.. కోట మిగలదు అంటూ తాజాగా విజయసారెడ్డి ట్విట్ చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీల కంటే తనతో పాటు నడిచి, తనతో కలిసి ఉన్న వారి నుంచే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని కీలక కేసుల్లో విజయసాయిరెడ్డి కూడా అప్రూవర్గా మారే అవకాశం ఉంది అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పై పెట్టిన అనేక కేసుల్లో విజయసాయిరెడ్డి నెంబర్ 2 గా ఉన్నారు. తాజాగా ఆయన వ్యవహార శైలి, చేస్తున్న విమర్శలను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఆయన ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఉన్న కీలక కేసుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అన్న నానుడిని నిజం చేస్తూ పలువురు నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే జుగప్సను కలిగిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తు కార్యాచరణను ఎలా ముందుకు తీసుకువెళ్తారు అన్నది చూడాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు చేసే విమర్శలకు అంతగా పస ఉండదు. కానీ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళే ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండడంతో ప్రజల్లోకి బలంగా వెళుతుంది. నమ్ముకున్న వాళ్ళు దూరం కావడంతో పాటు కుటుంబ సభ్యులు కూడా విమర్శలు చేస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి నైతికతను ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వీటిని జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొని ముందుకు పార్టీని తీసుకువెళతారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా రాబోయే నాలుగేళ్ల కాలం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సంక్లిష్టమైన కాలంగానే చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ఆయన ముందుకు ఎలా వెళతారో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది..


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్