అల్లు అర్జున్ చుట్టూ ముదురుతున్న వివాదం.. బెయిల్ రద్దుకు పోలీసులు పిటిషన్.?

పుష్ప-2 ప్రీమియర్ షో రోజు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసిలాట వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఈ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయగా జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది.

allu arjun

 అల్లు అర్జున్ 

పుష్ప-2 ప్రీమియర్ షో రోజు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసిలాట వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఈ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయగా జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది. వెంటనే బెయిల్ రావడంతో మరుసటి రోజే అల్లు అర్జున్ విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను సినీ రంగానికి చెందిన ప్రముఖులు పరామర్శించారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏం చేశారంటూ సినీ ప్రముఖులు వెళ్లి పరామర్శించారంటూ అసహనాన్ని వెళ్ళగక్కారు. అల్లు అర్జున్ దే తప్పు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలను ఖండించేందుకు అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తనది తప్పు కాదంటూ పేర్కొన్న అల్లు అర్జున్ పోలీసులు వైపే తప్పు ఉన్నట్లుగా వ్యాఖ్యానించారు. అసలు అక్కడ తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిన విషయం తనకు తెలియదు అన్నట్లుగా అల్లు అర్జున్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఏసీబీ విష్ణుమూర్తి ఆదివారం సాయంత్రం మీడియా సమావేశాన్ని మాట్లాడి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం మంచిది కాబట్టి మీరు ఇంకా ఇక్కడ ఉంటున్నారంటూ వ్యాఖ్యానించారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కట్ చేస్తామంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఎక్కడితో ఆగకుండా పోలీసులు అల్లు అర్జున్ నిర్లక్ష్యానికి నిదర్శనం ఇదే అంటూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఆరోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన వ్యవహారానికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. అల్లు అర్జున్ ను థియేటర్ కు రావద్దంటూ సిఐ రాసిన లేఖను కూడా పోలీసులు బయటపెట్టారు. మహిళ చనిపోయిందని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ స్పందించలేదంటూ పోలీసులు వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేనేజర్ తమను అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదంటూ పోలీసులు వ్యాఖ్యానించారు. జరిగిన విషయాన్ని అల్లు అర్జున్ కు చెప్పినప్పటికీ సినిమా చూసిన తర్వాతే వెళ్తానన్నారంటూ ఏసిపి వెల్లడించారు. రేవతిని కాపాడేందుకు తాము తీవ్రస్థాయిలో ప్రయత్నించామని పేర్కొన్నారు. పౌరులు భద్రతే తమకు ముఖ్యమని ఎవరికీ వ్యతిరేకం కాదంటూ స్వయంగా బిజెపి కూడా దీనిపై వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవైపు పోలీసు శాఖ అల్లు అర్జున్ ను ఆధారాలతో సహా చుట్టూ ముడుతూ ఉంటే.. ఓయూ జేఏసీ నేతలు రేవతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలంటూ ఆదివారం సాయంత్రం అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడడంతో పాటు పూల కుండీలను ధ్వంసం చేశారు. ఈ దాడిని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. 

ఇది ఎలా ఉంటే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో సోమవారం తెలంగాణ పోలీసులు పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కేసు విచారణ దశలో ఉన్న సమయంలో మీడియా సమావేశం పెట్టడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యల పైన పూర్తి ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పుష్ప-2 సినిమా అద్భుత విజయం సాధించిన ఆనందం అల్లు అర్జున్ కు లేకుండా పోతుందన్న విషయం తాజా వ్యవహారాలను బట్టి అర్థం అవుతుంది. సినిమా విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు ఇదే వ్యవహారంపై అల్లు అర్జున్ కుటుంబం మదన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో తెలియక ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్