పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ.. యోచిస్తున్న ఆస్ట్రేలియా

సోషల్ మీడియా వినియోగం గత కొన్నాళ్లుగా విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నారులు పరిధికి మించి వినియోగిస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివల్ల చిన్నారుల్లో అనేక రుగ్మతలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు చిన్నారుల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆదిశగానే ఆస్ట్రేలియా కూడా అడుగులు వేస్తోంది.

childrens with cell phones

సెల్ ఫోన్ తో చిన్నారులు

సోషల్ మీడియా వినియోగం గత కొన్నాళ్లుగా విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నారులు పరిధికి మించి వినియోగిస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివల్ల చిన్నారుల్లో అనేక రుగ్మతలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు చిన్నారుల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆదిశగానే ఆస్ట్రేలియా కూడా అడుగులు వేస్తోంది. చిన్నపిల్లలు సోషల్ మీడియా వాడకుండా పూర్తిగా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియా పిల్లల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరకంగానూ ఇబ్బందులను గురిచేస్తుందని ఆయన వెల్లడించారు. పిల్లలు ఫోన్లను వదిలేసి మైదానాల్లో, ఈత కోలనుల్లో, టెన్నిస్ కోర్టుల్లో ఆడుకోవడం చూడాలని ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మొదట సోషల్ మీడియా ఖాతాల్లో వయసు ధ్రువీకరణ ఆప్షన్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తరువాత ఈ ఏడాది చివరి నాటికి చట్టాన్ని తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. అయితే, ఎంత లోపు వయసు ఉన్నవారు సోషల్ మీడియా వాడకుండా నిషేధం ఉంటుందనేది ఆయన స్పష్టంగా వెల్లడించారు. 14 ఏళ్లు లేదా పదహారేళ్లలోపు పిల్లలపై నిషేధం ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఆలోచనను డిజిటల్ హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ అలా చట్టం తీసుకువస్తే పిల్లలు ఫోన్లను చాటుగా వినియోగిస్తారని, ఇది చాలా ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. 

తీవ్రమైన ఇబ్బందులు 

చిన్నారులు సోషల్ మీడియా ఖాతాలను ఎక్కువ సమయం పాటు వినియోగించడం వలన అనేక ఇబ్బందులకు గురి అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు కంటి సంబంధిత సమస్యలు, మెదడుపై తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన అలసట వంటి ఇబ్బందులు చిన్నారులను వేధిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా ఖాతాలు ద్వారా తెలియని వ్యక్తులతో పరిచయాలు తద్వారా అనేక ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగాన్ని చిన్నారులకు దూరం చేయడం ద్వారా వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఈ తరహా ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్