తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయానికి అది వాయువ్యంగా పయనించి ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర తీరం సమీపంగా వెళ్ళింది. ఆ తరువాత 24 గంటల్లో ఉత్తరంగా కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని పయనిస్తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం కోస్తాలోని అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించగా, ఉత్తర కోస్తాలోని పలుచోట్ల ఒక మాస్టారు వర్షాలు కురిసాయి.
ప్రతీకాత్మక చిత్రం
తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. శుక్రవారం ఉదయానికి అది వాయువ్యంగా పయనించి ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర తీరం సమీపంగా వెళ్ళింది. ఆ తరువాత 24 గంటల్లో ఉత్తరంగా కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని పయనిస్తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం కోస్తాలోని అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించగా, ఉత్తర కోస్తాలోని పలుచోట్ల ఒక మాస్టారు వర్షాలు కురిసాయి. శుక్రవారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడతాయని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 35 నుంచి 45, అప్పుడప్పుడు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈనెల 21, 22 తేదీల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. వాతావరణం అనుకూలంగా లేనందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తం కావాలని సూచించింది.
నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందా.? లేదా.? అనే దానిపై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. వాయుగుండంగా బలపడితే ఈశాన్యంగా దిశ మార్చుకొని మయన్మార్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని ఒక మోడల్ అంచనా వేస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా పయనించే క్రమంలో బలహీనపడిన దాని ప్రభావంతో ఈ నెల 23, 24 తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మరో మోడల్ చెబుతోంది. దీనిపై శుక్రవారం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రెండు రోజుల నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు కులుస్తుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కొనసాగితే మరింత ఇబ్బందులు తలెత్తుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పంట నాశనం కాకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పొలాల్లో ఉన్న పంటలను భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.