కుంభమేళాలో కలుషితమైన నీరు.. ఎన్జీటీ తీవ్ర ఆందోళన

మహా కుంభమేళా సందర్భంగా కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్న త్రివేణి సంగమ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా పడిపోయింది. మొరుగుతో నీరు కలుషితం అయిపోయింది. ఇక్కడే నీటి కాలుష్యం ప్రాథమిక ప్రమాణాల స్థాయి మించిపోయి స్నానానికి అనుకూలం కాని విధంగా మారిపోయింది. నీటిలో ఫేకల్ కొలీఫామ్ బ్యాక్టీరియా స్థాయిని మించి పెరిగిపోయింది. తాము పరీక్షించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆ బాక్టీరియా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందని ఈ నెల మూడున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ఒక నివేదిక ద్వారా తెలియజేసింది. ఇటీవల ఒక కేసు విచారణలో ఎన్జీటీ ధర్మాసనం ఈ నివేదికను సమీక్షించి ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తాము కోరిన స్పందించని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (యుపిసిబి)పై ఎన్జిటి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Triveni confluence area

త్రివేణి సంగమ ప్రాంతం

మహా కుంభమేళా సందర్భంగా కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్న త్రివేణి సంగమ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా పడిపోయింది. మొరుగుతో నీరు కలుషితం అయిపోయింది. ఇక్కడే నీటి కాలుష్యం ప్రాథమిక ప్రమాణాల స్థాయి మించిపోయి స్నానానికి అనుకూలం కాని విధంగా మారిపోయింది. నీటిలో ఫేకల్ కొలీఫామ్ బ్యాక్టీరియా స్థాయిని మించి పెరిగిపోయింది. తాము పరీక్షించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆ బాక్టీరియా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందని ఈ నెల మూడున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) ఒక నివేదిక ద్వారా తెలియజేసింది. ఇటీవల ఒక కేసు విచారణలో ఎన్జీటీ ధర్మాసనం ఈ నివేదికను సమీక్షించి ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తాము కోరిన స్పందించని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (యుపిసిబి)పై ఎన్జిటి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేసులో బుధవారం జరిగే తదుపరి విచారణకు యూపి పిసిబి సభ్య కార్యదర్శితో పాటు ఇతర అధికారులు పాల్గొనాలని ఆదేశించింది. కాగా త్రివేణి సంగమంలో నీటి నాణ్యత పై అడిషనల్ కలెక్టర్ వివేక్ చతుర్వేది వివరణ ఇచ్చారు. పుణ్యా స్నానాలకు వీలుగా నదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని తెలిపారు. అన్ని ఘాట్లలో పిసిబి బృందం ప్రతిరోజు నీటి పరీక్షలు చేస్తుందని, నీటి నాణ్యత నియంత్రణలో ఉందని చెప్పారు. పువ్వులు, కొబ్బరికాయలు, ఇతరత్రా పూజా సామాగ్రిని ప్రతి రెండు గంటలకు ఒకసారి మిషన్లో సాయంతో తొలగిస్తున్నామని వెల్లడించారు. మహా కుంభమేళా పూర్తయ్యే వరకు నదిలో నీటిని శుభ్రంగా ఉంచడానికి నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహా కుంభమేళ నిర్వహణకు ₹7,000 కోట్లు కేటాయించిన యూపీ ప్రభుత్వం.. జలాలు, వ్యర్ధాల నిర్వహణకు రూ.1600 కోట్లు ఖర్చుపెడుతోంది. అత్యాధునిక పద్ధతుల్లో మురుగనీటి నిర్వహణ, వ్యర్ధాల తరలింపు ప్రక్రియను చేపడుతోంది. 

55 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి..

మహా కుంభమేళాలో నెల రోజులకు పైగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 55 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో సనాతన ధర్మాన్ని పాటించే 110 కోట్ల జనాభాలో సగం మంది మూడు నదుల సంఘంలో స్నానాలు చేశారని, ఈ సంఖ్య మహాకుంభముంచే ఈనెల 26 నాటికి 60 కోట్లు దాటుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలోని దాదాపు 143 కోట్ల మంది జనాభా ఉండగా.. ఇప్పటివరకు 38 శాతానికి పైగా ప్రజలు పుణ్యస్నానాలు చేశారని తెలిపింది. మహా కుంభమేళా ప్రారంభానికి ముందు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 405 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని యోగి సర్కార్ అంచనా వేసింది. అయితే ఆ సంఖ్య ఈనెల 14వ తేదీకే 50 కోట్లు దాటిందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో అత్యధికంగా మౌని అమావాస్య రోజున దాదాపు 8 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు వెల్లడించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్