రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న 48 గంటల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ - పశ్చిమ, పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం తమిళనాడు - ఆంధ్ర ప్రదేశ్ తీరాన్ని ఆనుకుని ఉంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మాస్టారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న 48 గంటల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ - పశ్చిమ, పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం తమిళనాడు - ఆంధ్ర ప్రదేశ్ తీరాన్ని ఆనుకుని ఉంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మాస్టారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి ఉంటాయి. సాయంత్రం నాలుగు గంటలు తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, పశ్చిమ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కొలిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో గాలి వేగం గంటకు 13 కిలో మీటర్లుగా ఉంటుందని, ఏపీలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని పేర్కొంది.
బంగాళాఖాతం నుంచి గాలులో నేరుగా తెలుగు రాష్ట్రాల్లోకి వస్తున్నాయి. కొన్ని నెలల తర్వాత మళ్లీ ఎలా జరుగుతుందని వెల్లడించింది వాతావరణ శాఖ. కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడుకు ఆనుకొని పశ్చిమ మధ్య నేరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాయలసీమ నుంచి కర్ణాటక, కేరళ మీదుగా అరేబియా సముద్రం వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాలోని చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు ఆదివారం కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఒక పోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. గడిచిన కొద్ది రోజుల నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే రెండు, మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నెల్లూరులో 37.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉందని, అందువల్ల వాతావరణం వేడెక్కడంతోపాటు ఉక్కపోత కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. కొద్దిరోజులుగా ఇదే వాతావరణం కొనసాగడంతో రాష్ట్రం నిప్పులు కొలిమిలా మారింది. ఇదే పరిస్థితి మరి కొద్ది రోజులు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.