||నర్సారెడ్డి||
(ఈవార్తలు ప్రతినిధి, గజ్వేల్, మనోజ్)
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి తేల్చి చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఈ సారి హస్తం గుర్తుకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని వెల్లడించరు. సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షురాలు ఆంక్షరెడ్డిగారి ఆధ్వర్యంలో ,కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించి, జగదేవపూర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు గజ్వేల్ లోను కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల స్కీమును చూసి బీఆర్ఎస్ పార్టీలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎవరు? ఎన్ని విధాలుగా కుట్రలుచేసినా, కుతంత్రాలకు పాల్పడినా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కేసిరెడ్డి రవీందర్ రెడ్డి, ప్యాక్స్ కాంగ్రెస్ పార్టీ మాజీ చైర్మన్, వంటేరు నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు, శ్రవణ్ కుమార్, జగదేవపూర్ మండల వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.