నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం ప్రచారం.. ఈనెల 26న ముగింపు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టు బోతున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రచారాన్ని అన్ని నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రస్థాయిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఈ ప్రచారం జరగనుంది. ఈనెల 26వ తేదీన మధ్యప్రదేశ్లోని మోవ్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలంలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది. డిసెంబర్ 26న కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

Rahul Gandhi releasing campaign brochure

ప్రచార బ్రోచర్ విడుదల చేస్తున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టు బోతున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రచారాన్ని అన్ని నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రస్థాయిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఈ ప్రచారం జరగనుంది. ఈనెల 26వ తేదీన మధ్యప్రదేశ్లోని మోవ్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మస్థలంలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది. డిసెంబర్ 26న కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజల్లోకి ఈ మూడు అంశాలపై విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించి చర్చ జరిగేలా చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టినట్లు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిసెంబర్ 26న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా పార్టీ జనవరి మూడో తేదీకి ఈ ప్రచారాన్ని వాయిదా వేసింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తుచేస్తూ రాజ్యాంగం విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ ప్రచారంలో నియోజకవర్గ జిల్లా స్థాయిలో సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని 13 నెలల పాటు కొనసాగించనుంది. ఈ ఏడాది జనవరి 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు సేవ్ కాన్స్టిట్యూషన్ నేషనల్ పాదయాత్ర పేరుతో భారీ ప్రచారాన్ని చేపట్టనుంది. అందులో కాంగ్రెస్ నాయకులు ప్రజలతో కలిసి రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి కృషి చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సేవ్ కాన్స్టిట్యూషన్ నేషనల్ మార్చ్ జనవరి 3 2025న ప్రారంభం కానుంది. ఇది భారత జోడోయాత్ర తరహాలో ఉంటుందని దేశ వ్యాప్తంగా రాజ్యాంగ విలువలను ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జైరాం రమేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాజాగా చేపట్టనున్న కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మరింత చేరువయ్యే లక్ష్యాన్ని ఆ పార్టీ ఏర్పరచుకున్నట్లు చెబుతున్నారు. బిజెపి జమిలి ఎన్నికల పేరుతో పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా పార్టీని సన్నద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం విస్తృతంగా దోహదం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోనే రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ ఉండేలా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ఒకవైపు పార్టీని సంస్థగా బలోపేతం చేయడం పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఎందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో నియామకాలను చేపట్టనుంది. అదే సమయంలో ప్రజల్లో నేతలు ఉండేలా చర్యలను చేపడుతుంది. అందులో భాగంగానే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉపకరిస్తుందో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్