కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజరస్ వైరస్ అని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. జీఎస్టీ రాబడిలో తెలంగాణ వెనుకబడి ఉందంటూ ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనాన్ని పోస్ట్ చేస్తూ ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను ఏడాది కిందటే చెప్పానని, అది ఇప్పుడు అక్షరాల నిజమైంది అంటూ జీఎస్టీ వసువులకు సంబంధించిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రంలో అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
కల్వకుంట్ల తారక రామారావు
కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజరస్ వైరస్ అని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. జీఎస్టీ రాబడిలో తెలంగాణ వెనుకబడి ఉందంటూ ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనాన్ని పోస్ట్ చేస్తూ ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను ఏడాది కిందటే చెప్పానని, అది ఇప్పుడు అక్షరాల నిజమైంది అంటూ జీఎస్టీ వసువులకు సంబంధించిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రంలో అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతేడాది 10 శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు.. ఇప్పుడు కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థిక రంగంలో ఈ విధ్వంసానికి గురైందని ఆరోపించారు. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే.. రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరమని కేటీఆర్ పేర్కొన్నారు. కేసిఆర్ పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రాసుకునే “చీకటి చరిత్ర” ఇదేనా అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఈ విషయాలను గుర్తించాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అధ్వానంగా మారుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కరువు తాండవించడం పైన కేటీఆర్ విమర్శలు గుర్తించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువుగా అభివర్ణించారు. రైతు బంధును సరిగ్గా ఇవ్వడం లేదని, నీళ్లు ఇచ్చే తెలివి లేదని ఆరోపించారు. కరెంట్ ఇచ్చే తెలివి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు. 48 గంటల్లో నీళ్లను వదలకపోతే, మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేస్తానని కేటీఆర్ తాజాగా హెచ్చరించారు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు.