పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘం 'పశ్చిమబంగా ఛాత్రో సమాజ్' మంగళవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును విచారించడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విద్యార్థి సంఘం ఆరోపించింది. 'నబన్నా అభియాన్' పేరుతో హావ్ డా నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు.
కోల్ కతాలో వైద్య విద్యార్థుల ఆందోళన
పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘం 'పశ్చిమబంగా ఛాత్రో సమాజ్' మంగళవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును విచారించడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ విద్యార్థి సంఘం ఆరోపించింది. 'నబన్నా అభియాన్' పేరుతో హావ్ డా నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. అయితే ఈ ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వకపోగా ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. దీంతో హావ్ డాలోని సంతర్గాచి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులను ముందుకు వెళ్ళనీయకుండా పోలీసులు బార్కేడ్లు ఏర్పాటు చేశారు. మార్చ్ లో పాల్గొన్న ఆందోళనకారులు బార్ క్యాడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. కొన్నింటిని లాగి పడేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు విద్యార్థులపై బాష్ప వాయువు ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
నినాదాలతో మార్మోగించిన విద్యార్థులు
బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలంటూ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థినికి న్యాయం చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తోందంటూ పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ మార్చి జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ ఈ సందర్భంగా నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో అదృశ్యమయ్యారని బిజెపి నేత సువేందు అధికారి ఆరోపించారు. విద్యార్థులు మిస్ అయ్యారంటూ కొందరు రాజకీయ నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని బెంగాల్ పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎవరూ అదృశ్యం కాలేదన్నది నిజమని వెల్లడించారు. దీనికి సువేందు బదులిస్తూ.. ఆ విద్యార్థుల కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయని, మమతా పోలీస్ కోర్టులో కలుద్దాం అంటూ సువేందు మరో పోస్ట్ పెట్టారు. ఇది ఎలా ఉంటే ఈ ఆందోళనలు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కోల్ కతా పోలీసు విభాగానికి చెందిన ఆరు వేల మందిని మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 26 జిల్లాల కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం.