వయనాడ్ ఉప ఎన్నికల్లో తీవ్రంగానే పోటీ.. బరిలో 16 మంది అభ్యర్థులు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈనెల 13వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ గెలిచిన ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు మరికొంతమంది అభ్యర్థులు కూడా ఇక్కడ పోటీ పడుతున్నారు.

Priyanka and Rahul Gandhi in Wayanad campaign

వయనాడ్ ప్రచారంలో ప్రియాంక, రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈనెల 13వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ గెలిచిన ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు మరికొంతమంది అభ్యర్థులు కూడా ఇక్కడ పోటీ పడుతున్నారు. ప్రియాంక గాంధీతోపాటు మరో 15 మంది అభ్యర్థులు ఈ స్థానానికి పోటీపడుతున్నారు. మొత్తంగా ఉప ఎన్నికల్లో 16 మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు అనుగుణంగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 11 మంది రాష్ట్రీయేతరులే ఉన్నారు. ఇప్పటి వరకు ప్రధాన మోడీ, అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు సహా ఎంతోమంది అగ్రనేతులపై 200కు పైగా ఎన్నికల్లో పోటీ చేసి ఎలక్షన్ కింగ్ గా పేరుపొందిన కే పద్మరాజన్ (తమిళనాడు) కూడా బరిలో ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై పోటీ చేసిన జయేంద్ర కే రాథోడ్ (గుజరాత్) కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

వీరితోపాటు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ జలీల్ (ఏపీ), జాతీయ జనసేన పార్టీకి చెందిన దుగ్గిరాల నాగేశ్వరరావు (తెలంగాణ), గోపాల్ స్వరూప్ గాంధీ (యుపి), బహుజన్ ద్రావిడ పార్టీ నుంచి ఏ సీత (తమిళనాడు), పోటీ చేస్తున్నారు. ఇంకా నూరు మహమ్మద్ (తమిళనాడు), ఇస్మాయిల్ జాబి ఉల్లా (కర్ణాటక), రుక్మిణి (కర్ణాటక), సోన్హు సింగ్ యాదవ్ (యూపీ) స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇక సిపిఐ నుంచి సత్యన్ మాకేరి, బిజెపి నుంచి నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆర్ రాజన్ ఒక్కరే వయనాడ్ నియోజకవర్గానికి చెందినవారు. కాగా, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్థానికేతరుడే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వయనాడ్ లో జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తున్నారని కేరళ సీఎం విజయం ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ లౌకికవాద ముసుగును పూర్తిగా బట్టబయలు చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ వైఖరి ఏమిటని, జమాతే ఇస్లాం గురించి మన దేశానికి తెలియనిది కాదన్నారు. ఆ సంస్థ భావజాలం ప్రజాస్వామిక విలువలకు అనుగుణంగా ఉందా.? అని విజయన్ ప్రశ్నించడం గమనార్హం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్