స్థానికత నిర్ధారణకు నలుగురు సభ్యులతో కమిటీ.. వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి లోకల్ నాన్ లోకల్ సంస్థను నిర్ధారించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగానే నలుగురు సభ్యులతో కూడిన కమిటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. కమిటీకి చైర్మన్ గా ఉన్నతి విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి కన్వీనర్ గా రాష్ట్ర సాంకేతిక కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, సభ్యులుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఏవి నరసింహారెడ్డిని నియమించారు.

Revanth Reddy

రేవంత్ రెడ్డి

వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి లోకల్ నాన్ లోకల్ సంస్థను నిర్ధారించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగానే నలుగురు సభ్యులతో కూడిన కమిటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. కమిటీకి చైర్మన్ గా ఉన్నతి విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి కన్వీనర్ గా రాష్ట్ర సాంకేతిక కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, సభ్యులుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఏవి నరసింహారెడ్డిని నియమించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ప్రవేశాల్లో స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించాల్సి వచ్చింది. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉంటేనే స్థానికులు అవుతారు. 15 శాతం కోటా కింద తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడేందుకు అవకాశం ఉంది. 371 (డి) అధీకరణంపై సర్వత్ర ఆందోళన నెలకొన్నాయి. 15 శాతం కోటా కింద తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పిల్లలు సైతం ఇప్పటి వరకు సీట్లు దక్కాయి. ఇప్పుడు ఈ కోటా తొలగిస్తే వీరి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ఎంబిబిసి ప్రవేశాల్లో గందరగోళం నెలకొంది. వీటన్నింటి దృష్టిగా ఈ కమిటీ అధ్యయనం చేసే ప్రభుత్వానికి వారం రోజుల్లో నివేదిక అందించనుంది. ఆయా ప్రవేశాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. ఇది ఎలా ఉంటే తెలంగాణలో జనవరి రెండో తేదీ నుంచి జరగాల్సిన వైద్య పీజీ వార్షిక పరీక్షలను కాలోజి హెల్త్ యూనివర్సిటీ వాయిదా వేసింది. ఈ పరీక్షలు జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయని రివైజ్డ్ టైమ్ టేబుల్ విడుదల చేసింది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదివేలు పూర్తయినప్పటికీ రాష్ట్రంలో లోకల్, నాన్ లోకల్ సమస్య ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ సమస్య ప్రధానంగా ఉంది. ఆయా ప్రవేశాల్లో ఈ సమస్య కొరకరాని కోయ్యగా మారింది. ఈ సమస్య నివృత్తిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సమస్య వల్ల ప్రదేశాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఎప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పలు కాలేజీలు ప్రతినిధులు తెలియజేశారు. ఈ వినతులను పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వీటి పరిష్కారానికి అనుగుణంగా నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని స్థానికత సమస్యలకు చెప్పనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్