నేటి నుంచి సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం.. కీలక నిర్ణయాలకు అవకాశం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళ, బుధవారాల్లో కలెక్టర్ల సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశాలు సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసం జరుగుతుంది. ఆ తర్వాత సీఎస్, రెవెన్యూ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగాలు ఉంటాయి. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. మొదటిరోజు సదస్సులో వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టిజిఎస్, ల్యాండ్ సర్వే, వేసవి నీటి ఎద్దడి, గ్రామీణ, పట్టణ ప్రాంత నేటి సరఫరాపై చర్చించనున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళ, బుధవారాల్లో కలెక్టర్ల సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశాలు సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసం జరుగుతుంది. ఆ తర్వాత సీఎస్, రెవెన్యూ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగాలు ఉంటాయి. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. మొదటిరోజు సదస్సులో వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టిజిఎస్, ల్యాండ్ సర్వే, వేసవి నీటి ఎద్దడి, గ్రామీణ, పట్టణ ప్రాంత నేటి సరఫరాపై చర్చించనున్నారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ ను ఇప్పటికే తయారుచేసుకున్నారు జిల్లా కలెక్టర్లు. ఆయా జిల్లాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ల పైన సదస్సులో చర్చించనున్నారు. ముఖ్య సమస్యలను ప్రస్తావించడంతోపాటు జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు, రెవిన్యూ సమస్యలు, భూసంస్థలపై మొదటి రోజు చర్చించనున్నారు. కలెక్టర్ల సదస్సుకు సంబంధించి ఇప్పటికే అధికారి అంతరంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. రానున్న రోజుల్లో ప్రజలకు మెరుగైన సేవలను అందించే దిశగా కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉంటుంది. ఆయా జిల్లాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి అన్న విషయాలను సీఎం చంద్రబాబు నాయుడు తెలుసుకోనన్నారు. అదే సమయంలో రానున్న రోజుల్లో కొత్తగా అమలు చేయబోతున్న కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కలెక్టర్లకు ఈ సమావేశంలో అందించే అవకాశం ఉంది. అలాగే ఎప్పటికే జరుగుతున్న పీఫోర్ సర్వేకు సంబంధించిన కీలక విషయాలను సీఎం చంద్రబాబు తెలుసుకోమన్నారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించే విషయానికి సంబంధించి భవిష్యత్తులో తీసుకోబోతున్న నిర్ణయాలకు అవసరమైన కార్యాచరణ తయారు చేయడం పైన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. 

కలెక్టర్ల సదస్సుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో కీలక అంశాలపై చర్చకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు, రెవిన్యూ సమస్యలు, కొత్త పథకాల అమలు, ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఉన్న ఇబ్బందులు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆయా అంశాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించే అవకాశం ఉంది. గత ప్రభుత్వాలయంలో తీసుకున్న అనేక నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికీ సమీక్షిస్తుంది. వాటిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందని దానిని కలెక్టర్లు తెలియజేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్