ఉత్తర భారత దేశానికి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే గడిచిన కొద్ది రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. అయితే రానున్న రోజుల్లో మరింతగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలకు రానున్న నాలుగు రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని స్పష్టం చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ఉత్తర భారత దేశానికి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే గడిచిన కొద్ది రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. అయితే రానున్న రోజుల్లో మరింతగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలకు రానున్న నాలుగు రోజుల్లో చలి తీవ్రత పెరుగుతుందని స్పష్టం చేసింది. ఈనెల 30 నుంచి జనవరి రెండో తేదీ వరకు తీవ్రమైన చలి (కోల్డ్ వేవ్) ఉంటుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలో ఈ చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్లో మరో రెండు రోజులు పాటు మంచు కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాశ్మీర్లో మంచు ప్రభావంతో ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడ పలు విమానాలు, రైళ్లు ఎప్పటికీ రద్దయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజులు పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
అప్రమత్తతతో ఆరోగ్యానికి రక్షణ..
చలి తీవ్రత పెరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆస్తమా, నిమోనియా వంటి సమస్యలు మరింత ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో పాటు మంచు అధికంగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆయా సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసరమైతే తప్ప వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకెళ్లకుండా ఉండడం ఉత్తమం అని సూచిస్తున్నారు.