గడిచిన కొద్దిరోజులు నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వరద ప్రభావం అధికంగా ఉండడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
గడిచిన కొద్దిరోజులు నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వరద ప్రభావం అధికంగా ఉండడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. బాధాకరమైన సందర్భమని, వరద ప్రజల బతుకుల్లో విషాదాన్ని తెచ్చిపెట్టిందన్నారు. మంత్రులు, అధికారులు నిరంతరం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిద్ర లేకుండా సమీక్షిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దలతో మాట్లాడుతుంటే 60, 70 ఏళ్లలో ఈ స్థాయి వర్షాన్ని చూడలేదని చెబుతున్నారన్నారు. భారీ వర్షాలు వల్ల రాజీవ్ గృహ కల్పలో నివసిస్తున్న వందల కుటుంబాలు నష్టపోయాయని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి వెళ్లి చూస్తే సర్వం నీళ్లలో మునిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
పప్పూ, ఉప్పూ మొదలుకుని అన్ని వస్తువులు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయారని, వరద నీటిలో తమ పిల్లలు సర్టిఫికెట్లు నానిపోయాయంటూ కొందరు వాపోతున్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వద్ద పలువురు ప్రస్తావించారు. ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు రూ.5 లక్షలు, పశు సంపద నష్టం వాటిల్లితే రూ.50 వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5 వేలు చొప్పున ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇళ్లు దెబ్బతింటే ఆ ఇళ్లకు పీఎం ఆవాస్ యోజన కింద నష్టాన్ని అంచనా వేసి దానికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. వరదల వల్ల సర్టిఫికెట్లు పోయిన వారికి కొత్తవి వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరద బాఽధితులగా మారిన కుటుంబాలకు అందుబాటులో ఉండి వారి కష్టాలను గట్టెక్కించే బాధ్యత తమదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నష్టాన్ని అంచనా వేస్తున్నారని, దైర్యంగా ఉండాలన్నారు.