మూసీ నదిని ప్రక్షాళన చేయాలని బలంగా నిర్ణయించుకున్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల అనేకమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలు నాశనం అవుతాయంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వం వెనక్కి తగ్గాలంటే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మూసీ నది, సీఎం రేవంత్ రెడ్డి
మూసీ నదిని ప్రక్షాళన చేయాలని బలంగా నిర్ణయించుకున్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల అనేకమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలు నాశనం అవుతాయంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వం వెనక్కి తగ్గాలంటే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన వల్ల మంచి జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజలు ఆందోళన చేస్తుండడం, దానికి ప్రతిపక్షాలు మద్దతు తెలియజేయడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది వెంబడి ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. మూసి నది వెంబడి ఈ పాదయాత్ర కొనసాగనుంది. దీనికి మూసి పునరుజ్జీవ యాత్రగా పేరు పెడుతున్నారు. వలిగొండ టు బీబీనగర్ మధ్య ఆరు కిలోమీటర్ల మేర ఈ పాదయాత్రను చేపట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసి పునరుజ్జీవం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ఈ మేరకు పాదయాత్రకు సిద్ధపడుతున్నారు.
మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా నల్గొండ ప్రజల కష్టాలను తీర్చుతామని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే మూసి వెంట ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర ఉపకరిస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ పాదయాత్రను రేవంత్ రెడ్డి పుట్టినరోజు అయిన నవంబర్ 8వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రకు ముందు కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఈ పాదయాత్రను ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దర్శనం పూర్తయిన తర్వాత రోడ్డు మార్గంలో వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుంటారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలోని బొల్లెపల్లి, సంగం, భీమలింగం వంతెన వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే మూసి పునరుద్యోగ ప్రజా చైతన్య యాత్రలో సీఎం పాల్గొంటారు. ఆ తరువాత మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లా వరకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఈ యాత్రపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేలా ఈ యాత్ర ఉంటుందని ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు చెబుతున్నారు.