పదేళ్లు అధికారులు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తాం.. ఓపిక తనకు ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లపాటు తమ ప్రభుత్వానికి అధికారం ఇస్తే అద్భుతాలు సృష్టించే ఓపిక తనకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ సమాజం తమకు అవకాశం కల్పిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy

 సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లపాటు తమ ప్రభుత్వానికి అధికారం ఇస్తే అద్భుతాలు సృష్టించే ఓపిక తనకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ సమాజం తమకు అవకాశం కల్పిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది అని పేర్కొన్నారు. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ కోసం చర్చ జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. తాను సీఎం కాగానే కేబినెట్ ఎంపికకు ఎంత ప్రాధాన్యత ఇచ్చానో.. వీసీల నియామకానికి అంతే ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. ఉన్నత విద్యా ప్రమాణాలు, సమాజంలోని అన్ని వర్గాల సమూహం మాదిరిగానే వీసీలకు కూడా ఇచ్చినట్లు తెలిపారు. వైస్ ఛాన్స్లర్ల నియామకంతో తమ పని అయిపోయిందని అనుకోవడం లేదని సీఎం వ్యాఖ్యానించారు.

కొత్తగా వచ్చిన వీసీలకు యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వానికి 10 ఏళ్లపాటు అవకాశాన్ని కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తామన్నారు. విశ్వవిద్యాలయాలను ప్రైవేటుపరం చేయాలని ఎవరైనా ఆలోచన చేసిన అది జరిగే పని కాదని స్పష్టం చేశారు. ఎంతోమంది విద్యావేత్తలను, ఉత్తమ పార్లమెంటేరియన్లను ఈ దేశానికి యూనివర్సిటీలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీలు నిర్వీర్యం అవుతుంటే చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేశారు. యూజీసీ నిబంధనల పేరుతో యూనివర్సిటీలపై పెత్తనం చేయాలని కొందరు చూస్తున్నారని.. యూజీసీ నిబంధనలు కుట్రతో మార్చాలనుకుంటున్నారని ఆరోపించారు. అటువంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నారని, తెలంగాణలోని యూనివర్సిటీలకు భవిష్యత్తులో బీసీలను ఢిల్లీలో ఉన్న వాళ్ళు నిర్ణయిస్తారని చెబుతున్నారన్నారు. ఢిల్లీలో ఉన్న వాళ్లకి తెలంగాణలో ప్రజలకు ఏం కావాలో ఎలా తెలుస్తుందని స్పష్టం చేశారు. ఈ ఆలోచన వెనుక పెద్ద సాంస్కృతిక దాడి దాగి ఉందని ముఖ్యమంత్రి ఆరోపించారు. అదే జరిగితే కొంతమంది చేసే విష ప్రచారాలకు యూనివర్సిటీలు వేదిక కాబోతున్నాయని వ్యాఖ్యానించారు. జనవరి 26 సందర్భంగా ప్రధానమంత్రికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని, యూజీసీ ని అడ్డం పెట్టుకొని చేసే కుట్రలు రాజ్యాంగంపై దాడిగా చూస్తామని స్పష్టం చేశారు. తమ ప్రజల మీద, తమ ప్రాంతాల మీద మీరు దండయాత్ర చేయాలని చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం తీసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునే సంస్థలు మాదిరిగా మారిపోతాయని వెల్లడించారు. మెజారిటీ ఉందని ప్రజాస్వామ్యం మూలాల మీద దాడి చేయాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి తెలంగాణకు ఇంకో అన్యాయం చేశారని, పద్మా పురస్కారాల్లో తెలంగాణకు ప్రతీక అయిన వారి పేర్లను ప్రతిపాదించినప్పటికీ పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు. మిత్రుడు మందకృష్ణ మాదిగకు ఇచ్చినందుకు తాను అభినందిస్తున్నట్లు తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్