సీనియర్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. కారణం అదేనా.?

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా దూకుడుతో వ్యవహరించేవారు. ఎటువంటి నేతను ఆయన తనదైన మాట పేరుతో దునుమాడేవారు. ఒకరకంగా చెప్పాలంటే అగ్రెసివ్ ఆటిట్యూడ్ తో రాజకీయాలను కొనసాగించి తనకంటూ తెలంగాణలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. కానీ, గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

CM Revanth Reddy on the platform of Palamuru

పాలమూరు సభా వేదికపై సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా దూకుడుతో వ్యవహరించేవారు. ఎటువంటి నేతను ఆయన తనదైన మాట పేరుతో దునుమాడేవారు. ఒకరకంగా చెప్పాలంటే అగ్రెసివ్ ఆటిట్యూడ్ తో రాజకీయాలను కొనసాగించి తనకంటూ తెలంగాణలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. కానీ, గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. దూకుడు స్వభావంతో ఉండే రేవంత్ రెడ్డి సంయమనం పాటిస్తూ భిన్నమైన రాజకీయాలను నడుపుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చేరారు. సాధారణంగా అయితే రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి కెసిఆర్ ను పరామర్శిస్తారని ఎవరు కలలో కూడా ఊహించరు. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించి వచ్చారు. ఈ ఘటన అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కూడా కెసిఆర్ విషయంలో ఆయన పెద్దగా విమర్శలు చేయలేదు. ఈ మధ్యకాలంలో విమర్శల జడివాన జరిగింది. అది వేరే విషయం. అదే సమయంలో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛపూరిత వాతావరణం ఆయనను ఇబ్బందులకు గురిచేస్తుందని అంతా భావించారు. రేవంత్ రెడ్డి ఎన్నాళ్లపాటు సీఎంగా నిలదొక్కుకుంటారన్న ప్రశ్నలు సర్వత్ర వ్యక్తం అయ్యాయి. అయితే అందుకు భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తూ ముందుకు సాగిపోతున్నారు.

సీనియర్లను మచ్చిక చేసుకుంటూనే తనకు ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లో జరిగిన రైతు పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్లపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను చూసిన ఎంతోమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న అనేక కీలక నిర్ణయాలకు ముఖ్య కారకులు మంత్రులే అన్న విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆనందదానికి గురి చేస్తుండగా.. ప్రతిపక్షాలను విస్మయానికి గురిచేశాయి. కాంగ్రెస్ పార్టీలో అనేకసార్లు మంత్రులుగా చేసిన ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారంతా రేవంత్ రెడ్డిని సీఎంగా చేయడాన్ని అంగీకరించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఏదో ఒకరోజు అటువంటి నేతలతో రేవంత్ రెడ్డికి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని చాలామంది పేర్కొన్నారు. అయితే ఇదే విషయంపై రేవంత్ రెడ్డి కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తనకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళికతో రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ ప్రణాళికలో భాగంగానే తాజాగా మంత్రులపై ప్రశంసలు కురిపించారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి సీనియర్ మంత్రులకు పూర్తిస్థాయిలో మార్పులు వేసేశారు. పాలమూరు బిడ్డ నైన తనను సీఎం గా చేయడానికి సీనియర్ల సహకారమే కారణం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. వయసులో చిన్న వాడిని అయిన సీనియర్ నేతల ఆశీర్వాదంతోనే సీఎం కుర్చీ దక్కిందంటూ భావోద్వేగంతో మాట్లాడారు. తాను ఏనాడు మంత్రిగా పని చేయనప్పటికీ సీనియర్లు తనని ఆదరించి అవకాశం కల్పించారంటూ వ్యాఖ్యానించారు. మీ అనుభవం అంత వయసు తనకు లేదంటూ కేకే అనే ఉద్దేశించి ఈ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకట్టుకున్నాయి. 

ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల వెనుక సీనియర్ నేతల ఆలోచనలే ఉన్నాయంటూ పేర్కొనడం ద్వారా.. వారికి అనేక పథకాల అమలు క్రెడిట్ ను అందించే ప్రయత్నం చేసి వారి మనసులను గెలుచుకున్నారు. రైతులకు బోనస్ ప్రకటించిన ఘనత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కుతుందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మన పాలమూరు అల్లుడే అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రైతు రుణమాఫీ చేయగలిగామంటే అదంతా డిప్యూటీ సీఎం, మంత్రి బట్టి విక్రమార్క చలవేనంటూ ప్రశంసించారు. పాలమూరు అంటేనే మల్లు కుటుంబం అని ఎంపీ మల్లు రవి, మంత్రి బట్టి విక్రమార్కలపై ప్రశంసలు కురిపించారు. మంత్రి దామోదర అంటే తనకు ఇష్టమని, అందుకే జిల్లాకు ఇన్చార్జిగా పెట్టుకున్నాను అంటూ వ్యాఖ్యానించారు. సీనియర్ మంత్రుల సహకారం లేకుంటే అభివృద్ధి అస్సలు సాధ్యం కాదంటూ రేవంత్ రెడ్డి పేర్కొనడం ద్వారా సీనియర్ నేతలకు తాను ఎటువంటి గౌరవాన్ని ఇస్తున్నాననే విషయాన్ని కేడర్ కు బహిరంగంగానే తెలియజేసే ప్రయత్నం చేశారు.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఉందంటూ రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అనేక నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటూ సీనియర్ నేతలను అవమానిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఇదే అంశంపై ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బహిరంగ సభ వేదికగానే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను చేయడం ద్వారా.. తాను సీనియర్ నేతలను కలుపుకుంటూ ముందుకు వెళుతున్నాను అనే విషయాన్ని ప్రజలతోపాటు ప్రతిపక్షాలకు తెలియజేసే ప్రయత్నం చేసినట్లు అయిందని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా కేడర్ ముందు తామంతా కలిసే ఉన్నామని విషయాన్ని.. ప్రతిపక్షాల చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్టు అయిందని పలువురు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్