ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదని, ఆ పార్టీని నమ్మవద్దని మహారాష్ట్ర, జార్ఖండ్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మోడీ ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విట్టర్లో స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదని, ఆ పార్టీని నమ్మవద్దని మహారాష్ట్ర, జార్ఖండ్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మోడీ ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. తమ ప్రభుత్వం గురించి మోడీ చేసిన ప్రకటనలో అనేక అపోహలు, అవాస్తవాలు ఉన్నాయని వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీఆర్ఎస్ దుష్పరిపాలన పోయిందని, ప్రజల ఆనందం, ఆశలు వెల్లువెత్తుతాయి అన్నారు. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు వాగ్దానాలు నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తమ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగానే అడుగులు వేస్తోందని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పదిలక్షలు ఆరోగ్య సంరక్షణకు విడుదల చేశామన్నారు. 11 నెలల్లో తెలంగాణ అమ్మలు, సోదరీమణులు 101 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ ట్రిప్స్ వినియోగించుకున్నారని, దీనివల్ల రూ.3,433 కోట్ల రూపాయలు మిగిల్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పాట ఏడాది కాకముందే అత్యంత పెద్ద హామీ అయిన రుణమాఫీని అమలు చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం వల్ల 22 లక్షల 22 వేల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు.
ఒక్కో రైతుకి రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, బిజెపి ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని వెల్లడించారు. 1.31 కోట్ల గ్యాస్ సిలిండర్లను ఇప్పటికే 500 కు పంపిణీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 11 నెలలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసి యువత ఆశలను నెరవేరుస్తున్నామని, ఏ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా తమకు సాటి రాదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నామని, 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన దాన్ని సరి చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యారంగంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని వివరించారు. 11 నెలల కాలంలో గత బిఆర్ఎస్ పాలనలో అలముకున్న చీకట్లో పారద్రోలుతున్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి పథంలో సాగుతూ ఉందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.