పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష.. తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. అయితే ఈ అవార్డుల ప్రకటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పద్మ అవార్డుల ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని వ్యాఖ్యానించారు. తాము ప్రతిపాదించిన కొందరు ప్రముఖులను మోదీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మందికి పద్మ అవార్డులను ప్రకటించిన మోడీ ప్రభుత్వం తెలంగాణకు కనీసం ఐదు అవార్డులను కూడా ప్రకటించకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి 

కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. అయితే ఈ అవార్డుల ప్రకటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పద్మ అవార్డుల ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని వ్యాఖ్యానించారు. తాము ప్రతిపాదించిన కొందరు ప్రముఖులను మోదీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మందికి పద్మ అవార్డులను ప్రకటించిన మోడీ ప్రభుత్వం తెలంగాణకు కనీసం ఐదు అవార్డులను కూడా ప్రకటించకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. మేధావులు, ప్రముఖులు, కళాకారులైన చుక్కా రామయ్య, గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, ధైర్య తిరుమల రావు లాంటి ప్రముఖులకు పద్మ అవార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వీరులో ఒక్కరికి కూడా పద్మ పురస్కారాలు ప్రకటించకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించడం లేదని వ్యాఖ్యానించారు.

పద్మ అవార్డుల్లో తెలంగాణపై చూపిన వివక్ష, రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై ప్రధాన నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ స్పందించారు. ఈ తరహా విధానాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిలుస్తాయని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఒకవైపు తెలంగాణకు జరిగిన అన్యాయం పట్ల అసహనాలు వ్యక్తం చేస్తూనే.. మరోవైపు పురస్కారాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలను తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ, డాక్టర్ డి నాగేశ్వర్రెడ్డి, మందకృష్ణ మాదిగ, దివంగత మిరియాల అప్పారావు, మాడుగుల నాగఫణి శర్మ, కేఎల్ కృష్ణ, రాఘవేంద్ర ఆచార్య తదితరులకు పద్మ పురస్కారాలు లభించడం పట్ల రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయా ప్రముఖులంతా వారు ఎంచుకున్న రంగాల్లో చేసిన విశేష సేవలు, కృషి దేశంలోని ఉన్నత పౌర పురస్కారాలకు ఎంపిక అయ్యేలా చేశాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్