ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామమూర్తి నాయుడు ఆరోగ్యం మిశ్రమంగా మారింది. గడిచిన కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలిసింది. గడచిన కొద్ది రోజుల నుంచి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
సోదరుడు రామ్మూర్తి నాయుడుతో చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామమూర్తి నాయుడు ఆరోగ్యం మిశ్రమంగా మారింది. గడిచిన కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలిసింది. గడచిన కొద్ది రోజుల నుంచి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విషయాన్ని తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అమరావతిలో ఉన్న మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ కు పయనమై వెళ్లారు. చిన్నాన్న చికిత్స పొందుతున్న ఆసుపత్రికి నేరుగా మంత్రి లోకేష్ వెల్లనున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా సోదరుడు ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని హైదరాబాద్ కు బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్లాల్సి ఉంది.
అయితే సోదరి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో మహారాష్ట్ర కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతున్నారు. ఢిల్లీలో ప్రముఖ దినపత్రిక నిర్వహిస్తున్న కాంక్రీట్ లో పాల్గొన్న అనంతరం హైదరాబాద్ కు పైనమవుతారు శనివారం సాయంత్రానికి ఆయన హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఏఐజి ఆసుపత్రికి వెళ్ళనన్నారు. నారా రామమూర్తి నాయుడు గడిచిన కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. గడిచిన 20 ఏళ్లుగా ఆయన బయట ప్రపంచానికి కనిపించడం లేదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుండడంతో ఆయనే ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆరోగ్యం మరింత క్షీణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుమారుడు రోహిత్, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఉన్నారు. మంత్రి నారా లోకేష్ అమరావతి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా, సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి పయనమై హైదరాబాదు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.