మంత్రివర్గంలోకి మెగా బ్రదర్ నాగబాబు.. ప్రకటించిన సీఎం చంద్రబాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబుకు ఏపీ క్యాబినెట్ లో చోటు దక్కింది. ఏమేకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న ఆయన 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

nagendrababu

నాగేంద్రబాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబుకు ఏపీ క్యాబినెట్ లో చోటు దక్కింది. ఏమేకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న ఆయన 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన సిద్ధపడినప్పటికీ పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన తన సోదరుడు పవన్ కళ్యాణ్ విజయం కోసం పిఠాపురంలో మకాం వేసి మరి పని చేశారు. అనుకున్నట్టుగానే రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. ఈ మూడు స్థానాల్లో ఒక స్థానం తనకు దక్కుతుందని నాగబాబు ఆశిస్తూ వచ్చారు.. అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లి బిజెపి అగ్ర నాయకులతో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయి. బిజెపి కోటాలో ఒక స్థానాన్ని దక్కించుకోగా టిడిపి రెండు రాజ్యసభ స్థానాలను తీసుకుంది. దీంతో నాగబాబు చిరకాల కోరిక అయినా ఎంపీ కావడం నెరవేరలేదు. అయితే అనూహ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేస్తూ విడుదల చేసిన నోట్ లో.. ఏపీ క్యాబినెట్ లోకి నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది మాత్రమే ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు నాలుగు, బిజెపికి ఒకటి, మిగిలిన 20 మంత్రి స్థానాలు టిడిపికి కేటాయించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. మరో స్థానం జనసేనకు కేటాయించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ స్థానాన్ని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

శాసన మండల కోటాలో ఆయన మంత్రివర్గంలో చేరనున్నారు. మంత్రివర్గంలో చేరిన ఆరు నెలల్లో ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ స్థానాన్ని భర్తీ చేయడం ద్వారా కూటమికి కేటాయించిన నాలుగు మంత్రి పదవులు పూర్తిస్థాయి అయినట్లు అవుతుంది. తాజా నిర్ణయంతో జనసేన కీలక నేత నాగబాబు జాక్ పాట్ కొట్టినట్టు అయింది. రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు సోదరులు ఒకేసారి మంత్రులుగా ఉన్నట్టు అవుతుంది. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో తండ్రి, కొడుకులు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా, ఆయన కుమారుడు లోకేష్ మంత్రిగా ఉన్నారు. బాబాయ్, అబ్బాయిలు అచ్చం నాయుడు, రామ్మోహన్ నాయుడు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. తాజాగా మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేరితే ఇద్దరు సోదరులు మంత్రివర్గంలో ఉన్నట్టు అవుతుంది. ఇదిలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. ఇప్పటికే బీజేపీకి కేటాయించిన ఒక స్థానానికి ఆర్.కృష్ణయ్య పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు స్థానాల్లో ఒక స్థానానికి బీద మస్తానరావు, మరో స్థానానికి చానా సతీష్ పేర్లను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. వీరంతా మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్