నామినేటెడ్ పోస్టులు భర్తీ దిశగా సీఎం చంద్రబాబు.. కష్టపడిన వారికి కీలక బాధ్యతలు

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ.. కేడర్ కు పదవులు అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించిన వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లను ఆ పదవుల నుంచి తప్పుకోవాలంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.

Telugu Desam Party workers

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు


సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ.. కేడర్ కు పదవులు అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించిన వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లను ఆ పదవుల నుంచి తప్పుకోవాలంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఆయా పదవుల్లో ఉన్న వైసీపీకి చెందిన నాయకులు పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయా పదవులను టిడిపికి చెందిన నాయకులు, కార్యకర్తతో భర్తీ చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. సాధారణంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి చంద్రబాబు నాయుడు ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ ఉంటారు. గతంలో కూడా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు చంద్రబాబు నాయుడు సంకోచించేవారు. కానీ అందుకు విరుద్ధంగా ఈసారి ఆయన వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను పదవుల్లో నుంచి దిగిపోవాలని ఆదేశించారు. ఆ వెంటనే తన పార్టీకి చెందిన నాయకులను ఆయా పోస్టుల్లో నియమించేందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల 2029 సార్వత్రిక ఎన్నికలకి పార్టీ కేడర్ ఉత్సాహంతో పనిచేస్తుందని ఆయన భావిస్తున్నారు. వివిధ కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులతోపాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ లో మొన్న ప్రత్యేక ఆహ్వానితుల పోస్టులు, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు, వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించిన పదవులను పార్టీ కోసం గడిచిన ఐదేళ్లుగా కష్టపడిన వారికి అందించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా పోస్టులకు సంబంధించిన జాబితాను ఆయన రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన ఐదేళ్లుగా పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు నాయకులు వివరాలను కూడా ఆయన ఇప్పటికే తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరు సిఫార్సులకు తావు లేకుండా, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే ఆయా పదవులను అప్పగించాలని చంద్రబాబునాయుడు తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో ఆయా పదవుల భర్తీ ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల కోసం పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు లాబీయింగ్ చేస్తున్నారు. ఏదో ఒక పదవిని చేపట్టడం ద్వారా హోదాను అనుభవించవచ్చని నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. 

జనసేన కు దక్కినా..!

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉంది. ఆయన జగన్ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ.. జనసేనకు ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం లభిస్తుందా అన్నదానిపై చర్చ జరుగుతుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసేనకు ఎంత శాతం ఇస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. అదే సమయంలో బిజెపి నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే ఆశావహులు ఉన్నారు. మీరు కూడా తమకు కొన్ని స్థానాలను అప్పగించాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు జనసేనకు, బిజెపికి ఏ స్థాయిలో నామినేటెడ్ పోస్టులను అప్పగిస్తారో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్