ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ముగించుకుని గురువారం రాత్రి 12:30 గంటలకు జ్యూరిచ్ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీలోని అధికారిగా నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. శుక్రవారం ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు నాయుడు అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలవనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ముగించుకుని గురువారం రాత్రి 12:30 గంటలకు జ్యూరిచ్ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీలోని అధికారిగా నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. శుక్రవారం ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు నాయుడు అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలవనున్నారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిలతో భేటీ కానున్నారు. వీరితో సమావేశం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం కానున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని అభ్యర్థించనున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఆయా శాఖల మంత్రుల దృష్టికి రాష్ట్ర అవసరాలను తీసుకువెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి వారిని కలిసి వారిపై మరోసారి కీలక చర్చలు జరుపుకున్నారు. ఇది ఎలా ఉంటే నాలుగు రోజులు పాటు ప్రపంచ పెట్టుబడులు సదస్సులో పాల్గొనే సీఎం చంద్రబాబు నాయుడు తెచ్చారు. ఈ నాలుగు రోజులు దావోస్ పర్యటనలో భాగంగా 15 వాయినిధ్య సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశం అయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, పలు సదస్సులో ఆయన బిజీగా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సు వేదికగా తెలియజేశారు. ఆయనతోపాటు మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు కూడా దావోస్ పర్యటనలో ఉన్నారు.