నేడు ప్రధాన మోడీతో సీఎం చంద్రబాబు భేటీ.. బిల్ గేట్స్ తో పలు ఒప్పందాలు.!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఆయనను ఆహ్వానించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో కూడా సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు పోలవరం - బనకచర్ల అనుసంధాన పథకం తాలూకు డిపిఆర్ ను అందించనున్నారు.

Chandrababu with PM Modi (file photo)

ప్రధాని మోదీతో చంద్రబాబు (ఫైల్ ఫోటో)

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఆయనను ఆహ్వానించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో కూడా సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు పోలవరం - బనకచర్ల అనుసంధాన పథకం తాలూకు డిపిఆర్ ను అందించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించేందుకే మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లారు. పనిలో పనిగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు విషయాన్ని అడుగుతున్నారు. 

బిల్ గేట్స్ తో కీలక ఒప్పందాలు..

సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ తో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఢిల్లీలో ఈమెకు బిల్ గేట్స్ తో ఆయన సమావేశం కానున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఒబెరాయ్ హోటల్ లో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను ఆయన కలుస్తారు. ఇద్దరి సమక్షంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిపాలన, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో అవగాహన పత్రంపై సంతకాలు చేయనున్నారు. ఆరోగ్య డేటా వ్యవస్థలు, టెలి మేడిసన్, తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, వైద్య ఉపకరణాలు, డిజిటల్ విద్యా జాతీయ విద్యా సదస్సు విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞాన పరికరాలు, ప్రజా సేవలు, వ్యవసాయంలో ఉపగ్రహ డేటా ద్వారా పారదర్శకంగా సబ్సిడీ పంపిణీ, ఉత్పాదకత, వివిధ రంగాల్లో ఉపాధి కల్పన పైన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఈ రంగాలన్నింటిలోనూ ప్రధానంగా ఏఐను అన్వయించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వీటికి సంబంధించిన కీలక ఒప్పందాలు చేసుకునేందుకు అనుగుణంగా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్చలు పూర్తి చేశారు. 

నిధుల కోసం ప్రత్యేకంగా సమావేశాలు..

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రావలసిన నిధులు, కీలక ప్రాజెక్టులకు సంబంధించిన కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో పాటు, నితిన్ గడ్కరి, రైల్వే శాఖ మంత్రి, ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రితో సమావేశం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులతోను ఆయన సమావేశం పాల్గొన్నారు. కొందరు ఎంపీలకు వివిధ శాఖలకు సంబంధించిన బాధ్యతలను ఆయన గతంలోని అప్పగించారు. ఎంపీలకు అప్పగించిన బాధ్యతలకు అనుగుణంగా వారు ఎలా పని చేస్తున్నారని దానిపైన సమాచారాన్ని సేకరించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి ఆయా శాఖలకు ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు అనే విషయాలపై ఆరా తీయనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్