ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసేందుకు ఆయన బాపట్ల జిల్లాలోని చినగంజాం మండల పరిధిలోని కొత్త గొల్లపాలెం గ్రామానికి వెళ్ళనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామానికి చేరుకున్నాడు. ఉదయం 11:45 గంటలకు ఈ గ్రామానికి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10.40 గంటలకు ఉండవల్లి లోని ఇంటి వద్ద నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.10 గంటలకు కొత్త గొల్లపాలెం గ్రామానికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసేందుకు ఆయన బాపట్ల జిల్లాలోని చినగంజాం మండల పరిధిలోని కొత్త గొల్లపాలెం గ్రామానికి వెళ్ళనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామానికి చేరుకున్నాడు. ఉదయం 11:45 గంటలకు ఈ గ్రామానికి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10.40 గంటలకు ఉండవల్లి లోని ఇంటి వద్ద నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.10 గంటలకు కొత్త గొల్లపాలెం గ్రామానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం అధికారులతోనూ సమీక్ష సమావేశాన్ని నిర్వహించే వివిధ అంశాలపై కీలక సూచనలు చేయనున్నారు. 11:45 గంటల నుంచి 12.25 గంటల వరకు ఈ గ్రామంలోని పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను ఆయన పంపిణీ చేస్తారు. ఇంటింటికి వెళ్లి ఈ పెన్షన్లను ఆయన అందించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కష్టాలను ఆయన పరిశీలిస్తారు. అనంతరం దివ్యాంగులకు ఎలక్ట్రికల్ స్కూటర్లను పంపిణీ చేయనున్నారు. 12:35 గంటల నుంచి 1.30 గంటల వరకు గ్రామానికి చెందిన ప్రజలతో ఆయన సమావేశం అవుతారు. ఆ తర్వాత కొత్త గొల్లపాలెం గ్రామంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో అన్ని షాప్ పనులను పూర్తి చేసుకొని తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి ఉండవలెను తన నివాసానికి చేరుకుంటారు.
ప్రతినెలా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను భారీగా పెంచింది. ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా చేపడుతోంది. గ్రామస్థాయి నాయకులు నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల వరకు ప్రతి ఒక్కరు నేరుగా పలువురు లబ్ధిదారులకు ప్రతినెల మొదటి రోజు ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రతినెల ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూ గ్రామంలోని పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సదరు పెన్షనర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటి గురించి ప్రజలకు వివరిస్తారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అవుతూ వస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా బాపట్ల జిల్లాలోని కొత్త గొల్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఒకవైపు జిల్లా యంత్రాంగం తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా ఇప్పటికే ఈ గ్రామానికి చేరుకున్నారు.