సీఎం చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే.!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటన ఖరారు అయింది. ఈనెల 31న నరసారావు పేట మండలం యలమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. అనంతరం ఆయన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో యలమంద వద్ద సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీ, పరిశీలించారు. పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Chief Minister Nara Chandrababu Naidu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటన ఖరారు అయింది. ఈనెల 31న నరసారావు పేట మండలం యలమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. అనంతరం ఆయన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో యలమంద వద్ద సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీ, పరిశీలించారు. పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా అయితే ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలి. అయితే నూతన సంవత్సర వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఈ ఉద్దేశంతోనే ముందు రోజే పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పులిపాడు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు అన్న ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.. జనవరి ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరోచోట జరుగుతుందని ప్రచారం జరిగింది.

పులిపాడు గ్రామంలో కాకుండా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం అన్నారంలో సీఎం పర్యటిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే నరసారావు పేట నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఇదే నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయాలన్న ఆలోచనతో నాయకులు కార్యక్రమాన్ని అక్కడికి మార్చారనేది జరిగిన ప్రచారం. అక్కడే గ్రామ సభతోపాటు పెన్షన్లు పంపిణీ చేస్తారని అధికారులు భావించారు. గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంలో మళ్లీ మరో మార్పు జరిగింది. తాజాగా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని, అక్కడే పెన్షన్లు పంపిణీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు జనవరి ఒకటో తేదీని కాకుండా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 31 ఉదయాన్నే పూర్తి చేయాలని ఆలోచనతో అటు సీఎం కార్యాలయం, టిడిపి నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ యలమంద గ్రామంలో పర్యటించారు. అక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి అవసరమైన స్థలంతోపాటు సభా వేదిక ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని టిడిపి నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటలకు ఈ గ్రామానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం సీఎం రాకకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్