మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. దేశంలో తొలి ఎంపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఇదే

విశాఖలోని మెడ్ టెక్ జోన్ లో తయారు చేసిన తొలి మంకీ పాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి ఎంపాక్స్ వైరస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 70కి పైగా దేశాల్లో ఈ వైరస్ జోరుగా విస్తరిస్తున్నట్లు వరల్డ్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో సూచించింది. కోవిడ్ తరహాలో ఈ మహమ్మారి కూడా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో గల మెడ్ టెక్ జోన్ లో అద్భుత పరిశోధన సాగించారు.

CM Chandrababu Naidu unveiling the kit

కిట్ అవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు

విశాఖలోని మెడ్ టెక్ జోన్ లో తయారు చేసిన తొలి మంకీ పాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి ఎంపాక్స్ వైరస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 70కి పైగా దేశాల్లో ఈ వైరస్ జోరుగా విస్తరిస్తున్నట్లు వరల్డ్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో సూచించింది. కోవిడ్ తరహాలో ఈ మహమ్మారి కూడా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో గల మెడ్ టెక్ జోన్ లో అద్భుత పరిశోధన సాగించారు. ఎంపాక్స్ ను కొద్ది క్షణాల్లోనే నిర్ధారించే పరికరాన్ని తయారు చేశారు. మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణకు పూర్తి స్వదేశీయ పరిజ్ఞానంతో ఈ ఆర్టీపీసీఆర్ కిట్ రూపొందించారు. దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు గురువారం ఆవిష్కరించి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ కిట్‌ను ఏపీలో అభివృద్ధి చేయడం అభినందనీయన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. భవిష్యత్తులోనూ ఈ తరహా అద్భుత ఆవిష్కరణలకు మెడ్ టెక్ జోన్ కేంద్ర బిందువుగా మారాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. కరోనా సమయంలోను ఇక్కడ అద్భుతమైన పరిశోధనలు సాగినట్లు సీఎం వెల్లడించారు. ఈ కిట్ ను తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెడ్ టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్‌డెక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్‌  పేరుతో ఈ కిట్ కు రూపకల్పన చేసినట్లు సీఈఓ జితేంద్ర శర్మ సీఎంకు వివరించారు.

క్షణాల్లోనే వైరస్ నిర్ధారణ 

ఈ కిట్ వినియోగించి క్షణాల్లోనే వైరస్ నిర్ధారణ చేసేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ నిర్ధారణకు వివిధ పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. ఇందుకు కనీసం కొన్ని గంటల సమయం పడుతోంది. దీనివల్ల అనేక సందర్భాల్లో వైరస్ బారిన పడిన వారిని సకాలంలో గుర్తించలేకపోవడం జరుగుతోంది. ఇది వైరస్ మరింత వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందేందుకు కారణం అవుతోంది. ఈ సమస్యను గుర్తించిన మెడ్ టెక్ జోన్ అధికారులు కొద్ది క్షణాల్లోనే వైరస్ నిర్ధారించే కిట్ ను తయారుచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది వైద్యరంగంలోనే కీలకమైన అడుగుగా పలువురు అభివర్ణిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్