ఏపీలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళుతోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. నేరుగా ప్రజలు తనకే తన సమస్యలను చెప్పుకునేలా ఒక ప్రత్యేక నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చేందుకు అనుగుణంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఆయన ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు టోల్ ఫ్రీ నెంబర్ 7306299999 ఖరారు చేశారు. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఎవరైనా చంద్రబాబు నాయుడుకు సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళుతోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. నేరుగా ప్రజలు తనకే తన సమస్యలను చెప్పుకునేలా ఒక ప్రత్యేక నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చేందుకు అనుగుణంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఆయన ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు టోల్ ఫ్రీ నెంబర్ 7306299999 ఖరారు చేశారు. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఎవరైనా చంద్రబాబు నాయుడుకు సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఉంది. ఈ నెంబర్ ను నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు మైయిటైన్ చేయకపోయినా ఆయన ఆఫీస్ సిబ్బంది నిరంతరం ఈ నెంబర్కు వచ్చే సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తారు. ఈ ఫోన్ నెంబర్ కు వచ్చే ప్రతి కాల్ రికార్డు చేస్తారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరిస్తారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వివిధ స్థాయిల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే పార్టీ ఆఫీసుల్లోనూ మంత్రుల స్థాయి నేతలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. అప్పటికే సమస్యలు పరిష్కారం కాకపోతే నేరుగా సీఎం చంద్రబాబు నాయుడును సంప్రదించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ఈ టోల్ ఫ్రీ నెంబర్ తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో నేరుగా టచ్ లో ఉండే పలు కార్యక్రమాలు చేపట్టారు. అయితే వాటికి భిన్నంగా ఈసారి టోల్ ఫ్రీ నెంబర్ను ప్రవేశపెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యలను చెప్పుకునే వారి విషయంలో అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేలా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వివిధ రూపాల్లో దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. సమస్యల పరిష్కార దరఖాస్తులను పక్కన పడేయకుండా దానికి ఎకౌంటుబులిటీ ఉండేలా చూస్తున్నారు. ఎంతమంది సమస్యలు పరిష్కారం కోసం దరఖాస్తు చేస్తున్నారు. వారి సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు. పరిష్కరించకపోతే ఉన్న ఇబ్బందులు వంటి వివరాలతో సీఎంకు ఎప్పటికప్పుడు నివేదికలు అందించనున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వానికి అత్యధికంగా భూ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఈ కారణంగా ప్రత్యేకంగా రెవెన్యూ సరస్సులు కూడా నిర్వహించారు. అందులో వచ్చిన సమస్యల్లో అత్యధికం భూ వివాదాలు, 22ఏ కు సంబంధించినవే. అందుకే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు మరింత చేరువ అవ్వాలన్న ఉద్దేశంతోనే టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు.