ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవ వేడుకలను మహిళలతో కలిసి జరుపుకోవాలని అన్నారు. ఈ వేడుకలను మార్కాపురంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గానికి వెళ్ళనన్నారు. ప్రభుత్వ అధికారులు, పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా మార్కాపురం చేరుకుని మొదట జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ప్రజా ప్రతినిధులతో వివిధ అంశాలపై మాట్లాడిన అనంతరం 11:15 గంటలకు అధికారులతో భేటీ అవుతారు.
మహిళలతో చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫోటో)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవ వేడుకలను మహిళలతో కలిసి జరుపుకోవాలని అన్నారు. ఈ వేడుకలను మార్కాపురంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గానికి వెళ్ళనన్నారు. ప్రభుత్వ అధికారులు, పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా మార్కాపురం చేరుకుని మొదట జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ప్రజా ప్రతినిధులతో వివిధ అంశాలపై మాట్లాడిన అనంతరం 11:15 గంటలకు అధికారులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా అధికారులకు వివిధ సూచనలు చేసిన అనంతరం సభా ప్రాంగణం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శిస్తారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వివిధ పథకాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సుమారు గంటన్నరపాడు మహిళలతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని అనంతరం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహిళలతో ఆయన మాట్లాడనున్నారు.
ఇందుకోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సీఎంతో ముఖాముఖి అంశానికి సంబంధించి మాట్లాడే మహిళలను అధికారులు ఎంపిక చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరును పార్టీ కార్యకర్తలకు వివరించనున్నారు. పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత 4.42 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా, స్థానిక ఎమ్మెల్యే కందుల నారయణరెడ్డి నేతృత్వంలో రెండు రోజులుగా అక్కడి తర్లుపాడు రోడ్డులో సాయిబాబా హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ తెలిపారు. హెలీ ప్యాడ్ ప్రాంతాన్ని, సీఎం కాన్వాయ్ రూటును పరిశీలించిన అధికారులు.. ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.