బంగారు గనిపై పట్టు కోసం పపువా న్యూ గినియాలో ఘర్షణ.. కాల్పుల్లో 30 మంది మృతి

బంగారు గనిపై పట్టు కోసం పపువా న్యూ గినియా దేశంలో హింస చెలరేగింది. అల్లర్లు, విధ్వంసాలు, కాల్పులతో ఈ చిన్న దేశం అట్టుడికి పోతోంది. ఇక్కడ జరుగుతున్న ఘర్షణలు రోజురోజుకు తీవ్రస్థాయికి చేరుతుండడంతో భద్రతా దళాలకు అత్యవసర అధికారాలు అప్పగించి ఆయుధాలతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసే అంతగా పరిస్థితి ఇక్కడ దిగజారిపోయింది. ఈ ఏడాది మే నెలలో కొండచరియలు విరిగిపడి రెండు వేల మంది ప్రాణాలను బలిగొన్న బంగారు గని ఉన్న ప్రాంతంలోనే ప్రస్తుతం ఘర్షణలు జరుగుతుండడం గమనార్హం.

Riots in New Porgera area

న్యూ పోర్గేరా ప్రాంతంలో అల్లర్లు

బంగారు గనిపై పట్టు కోసం పపువా న్యూ గినియా దేశంలో హింస చెలరేగింది. అల్లర్లు, విధ్వంసాలు, కాల్పులతో ఈ చిన్న దేశం అట్టుడికి పోతోంది. ఇక్కడ జరుగుతున్న ఘర్షణలు రోజురోజుకు తీవ్రస్థాయికి చేరుతుండడంతో భద్రతా దళాలకు అత్యవసర అధికారాలు అప్పగించి ఆయుధాలతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసే అంతగా పరిస్థితి ఇక్కడ దిగజారిపోయింది. ఈ ఏడాది మే నెలలో కొండచరియలు విరిగిపడి రెండు వేల మంది ప్రాణాలను బలిగొన్న బంగారు గని ఉన్న ప్రాంతంలోనే ప్రస్తుతం ఘర్షణలు జరుగుతుండడం గమనార్హం. ఆస్ట్రేలియాకు సమీపాన ఉండే ఓషియానియా దేశమైన పపువా న్యూ గినియాలో న్యూ పోర్గేరా ప్రాంతంలోని బంగారు గనిని ఆగస్టులో సకార్ అనే గిరిజన తెగ ఆక్రమించుకుంది. వాస్తవానికి ఈ ప్రాంతంపై హక్కులు పయాండే తెగకు ఉన్నాయి. దీంతో రెండు తెగల మధ్య గత కొద్దిరోజుల నుంచి తీవ్రమైన ఘర్షణ జరుగుతోంది. ఆదివారం వరుస ఘటనల్లో 300కు పైగా రౌండ్లు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. ఈ సంఖ్య 50కి చేరవచ్చని పోలీసులు చెబుతున్నారు. క్షతగాత్రులు భారీగానే ఉన్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆందోళనల్లో వందలాది ఇల్లు ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మైనింగ్ చేస్తున్నవారు, వలసదారులు హింసకు దిగుతూ స్థానికులు, భూమి హక్కుదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధాలతో బహిరంగంగా తిరుగుతూ ఎవరినైనా బెదిరిస్తూ కనిపించినా వారిని కాల్చి వేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది.

మే నెలలో కొండ చరియలు విరిగిపడిన పొగెర గని ప్రాంతంలోనే ప్రస్తుతం ఘర్షణకు జరుగుతున్నాయి. ఈ గని కెనడా జాతీయుడు ఆధీనంలో ఉంది. పోప్ ఫ్రాన్సిస్ ఈ నెల మొదట్లో పపువాలో పర్యటించిన సందర్భంగా ఘర్షణలకు అంతం పలకాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ ఘర్షణలు తగ్గుముఖం పట్టలేదు. పైగా రోజురోజుకు ఘర్షణలో పెరుగుతుండడంతో ప్రభుత్వం కఠిన చర్యలు దశగా అడుగులు వేస్తోంది. ఈ ఘర్షణలు రోజు రోజుకు తీవ్రమవుతుండడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. బంగారు గనిపై ఆధిపత్యాన్ని సాధించేందుకు రెండు వర్గాలు అలుపెరుగుక పోరాటాన్ని సాగిస్తున్నాయి. ఈ పోరాటంలో పదుల సంఖ్యలో అమాయకులు మృత్యువాత చెందుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఘర్షణలను నిలువురించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ బంగారు గనిని సొంతం చేసుకుంటే కోట్లాది రూపాయల ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రెండు తెగలకు చెందిన ప్రజలు తీవ్రస్థాయిలో ఈ గనిని దక్కించుకునేందుకు ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు పక్షాలు దాడులకు తెగబడుతున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎప్పటికీ ముగుస్తుందో తెలియక స్థానిక ప్రజలు  ఆందోళన చెందుతున్నారు. రెండు తెగల మధ్య జరుగుతున్న గొడవల్లో అమాయకులు బలి అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్ర వ్యక్తమవుతోంది. ఇక్కడ జరుగుతున్న గొడవలపై ప్రపంచ నేతలు దృష్టి సారించి, శాంతి నెలకొనేలా చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ గొడవలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ హెచ్చరికలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించే వారిపై కాల్పులు జరపాలని కూడా ఇక్కడి ప్రభుత్వం ఆదేశించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్