Indo China Border: మగతనం ఫంగస్ కోసమే భారత్‌లోకి చైనా చొరబాటు?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

మాటిమాటికి భారత భూభాగంలోకి చైనా ఎందుకు చొరబడుతోంది? సామాజ్య విస్తరణ కాంక్షతోనే ఈ చొరబాట్లకు ప్రయత్నిస్తోందా? అంటే దాని వెనుక భారీ ప్లాన్ ఉందని, ఆకమణ అసలు నిజం కానేకాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగారం కంటే విలున కార్డిసెప్స్ (హిమాలయన్ గోల్డ్) ఫంగస్ కోసమే చైనా బలగాలు అరుణాచల్‌ప్రదేశ్‌లోకి చొచ్చుకొని వచ్చాయని ఇండో పసిఫిక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ పరిశోధకులు వెల్లడించారు. క్యాన్సర్‌ను నియంత్రించే గుణాలు, నపుంసకత్వాన్ని పోగొట్టే లక్షణం ఈ ఫంగస్‌లో ఉన్నాయని, అందుకే దీనికోసం చొరబాట్లకు పాల్పడుతున్నారని వివరించారు.

అతిశీతల వాతావరణంలోనే సాగు

కార్డిసెప్స్‌ను సూపర్ మష్‌రూమ్ అని కూడా పిలుస్తారు. ఇవి అతిశీతల వాతావరణం ఉండే.. హిమాలయాలు, క్వింఘై, టిబెట్ పీఠభూమి ప్రాంతాల్లోనే పెరుగుతాయి. పరిశోధనల్లో తేలకపోయినా.. కిడ్నీ సమస్యలు, కాలేయ సమస్యలు, మధుమేహం తదితర రోగాలు మొదలు నపుంసకత్వాన్ని పోగొట్టి, మగతనాన్ని పెంచే గొప్ప గుణాలు ఈ ఫంగస్‌లో ఉన్నాయని చైనా ప్రజలు భావిస్తున్నారు. అందుకే దీనికి భారీ డిమాండ్. ఇవి కాషాయ రంగులో సన్నగా ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో 2022లో దీని విలువ ఏకంగా రూ.9 వేల కోట్లు అని మార్కెట్ వర్గాల నిపుణులు చెబుతున్నారు.

80 శాతం ప్రజలకు జీవనాధారం

అయితే, గత కొంతకాలంగా చైనాలో కార్డిసెప్స్ సాగు తగ్గిపోయింది. దీంతో వారు హిమాలయ ప్రాంతాల్లో సేకరిస్తున్నారు. అదే సమయంలో హిమాలయ ప్రాంతాల్లోని ప్రజలు వీటిని సేకరించి, అమ్మి పొట్టపోసుకుంటున్నారు. టిబెట్, హిమాలయ ప్రాంతాల్లో 80 శాతం మంది ప్రజలకు ఈ ఫంగసే జీవనాధారం. ఇదే ఇప్పుడు చైనీయుల చొరబాటుకు కారణమైందని ఇండో పసిఫిక్ సెంటర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్