టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా.. అరచేతితో చెల్లింపులు చేసే టెక్నాలజీ అమలు

అరచేతి ద్వారా చెల్లింపులు చేసే సరికొత్త సాంకేతికతను చైనాలో అమలు చేస్తున్నారు. అడ్వాన్సుడ్ టెక్నాలజీని అందుబాటులో తీసుకురావడంలో ముందుండే చైనా అధునాతన విధానాన్ని అమలు చేస్తోంది. స్కానర్ ముందు అరచేతను ఉంచితే చాలు. కొన్న సరుకుల విలువ మేరకు బిల్లు చెల్లింపు ప్రక్రియ జరిగిపోయేలా ఈ విధానం ప్రస్తుతం అక్కడ అమలు జరుగుతోంది. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానం చైనాలో అందుబాటులోకి వచ్చింది.

Palm payment method

అరచేతితో చెల్లింపులు చేస్తున్న విధానం

ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా స్టోర్ కి, మాల్ కి, ఇతర దుకాణాలకు వెళ్లి వస్తువులు కొనుగోలు చేస్తే కార్డులు వినియోగించి, ఫోన్ స్కానర్ ఓపెన్ చేసి చెల్లింపులు చేస్తుంటాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెబిట్, క్రెడిట్ కార్డుతోపాటు యూపీఐ యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్న విధానం అందరికీ తెలిసినదే. ఇవేవీ లేకుండా అరచేతి ద్వారా చెల్లింపులు చేసే సరికొత్త సాంకేతికతను చైనాలో అమలు చేస్తున్నారు. అడ్వాన్సుడ్ టెక్నాలజీని అందుబాటులో తీసుకురావడంలో ముందుండే చైనా అధునాతన విధానాన్ని అమలు చేస్తోంది. స్కానర్ ముందు అరచేతను ఉంచితే చాలు. కొన్న సరుకుల విలువ మేరకు బిల్లు చెల్లింపు ప్రక్రియ జరిగిపోయేలా ఈ విధానం ప్రస్తుతం అక్కడ అమలు జరుగుతోంది. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానం చైనాలో అందుబాటులోకి వచ్చింది. పాకిస్తాన్ కు చెందిన రానా హంజా సైఫ్ అనే కంటెంట్ క్రియేటర్ చైనాలోని జూజౌ పట్టణంలోని ఒక స్టోర్లో ఈ ఫామ్ పేమెంట్ సిస్టం ద్వారా జరుగుతున్న చెల్లింపులను చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. చైనాలో ఈ తరహా చెల్లింపుల కోసం ఆయన తన అరచేతిని స్కాన్ చేయించుకుని రిజిస్టర్ చేసుకున్నారు. తరువాత తన చేతితోనే చెల్లింపులు చేశారు. ఈ వ్యవహారానంతటిని ఆయన వీడియోగా తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

'సాంకేతిక మౌలిక రంగాల్లో ముందంజలో నిలిచి ప్రపంచ దేశాలకే సవాలు విసురుతున్న చైనా ప్రస్తుతం 2050లో ఉంది' అని వీడియో కింద క్యాప్షన్ పెట్టారు. పామ్ పేమెంట్ విధానంపై నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది త్వరలో అమలు కానుంది ఏమో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై సైఫ్ తరహా లోనే ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్బిజి గ్రూప్ చైర్మన్ హర్ష గోయాంక గతంలోనే ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. బీజింగ్ లోని మెట్రోలో ఒక మహిళా తన చేతితో చెల్లింపు చేస్తుండడాన్ని అందులో చిత్రీకరించారు. ఈ విధానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో చర్చినీయాంశంగా మారింది. అరచేతి ద్వారా చెల్లింపులు చేయాలంటే యూపీఐ యాప్స్ తరహాలోనే కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అరచేతిని ప్రత్యేక స్కానర్ ద్వారా స్కాన్ చేయించాలి. ఆ తరువాత ఆ స్కాన్ చేసిన అరచేతి జేరాక్స్ బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసి మొబైల్ నెంబర్ తో కూడిన యాప్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయితే ఎక్కడైనా కేవలం అరచేతిని ఉపయోగించి నగదరహిత చెల్లింపులు చేయవచ్చు. అయితే ఈ విధానం ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉండడంతో అక్కడ మాత్రమే ఇటువంటి చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంటుంది. చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని చూస్తున్న ఎంతోమంది ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్