ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజలకు కల్పిస్తున్న భరోసా

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు అనేక ప్రాంతాల్లో బోటుపై ప్రయాణించిన చంద్రబాబు నాయుడు బాధితులకు భరోసాను కల్పించారు. అర్ధరాత్రి దాటే అంతవరకు అనేక ప్రాంతాల్లో కలియ జరిగిన చంద్రబాబు నాయుడు బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను దగ్గరుండి అందించారు. మళ్లీ సోమవారం ఉదయం కూడా వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు.

Chandrababu touring flooded areas

ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు అనేక ప్రాంతాల్లో బోటుపై ప్రయాణించిన చంద్రబాబు నాయుడు బాధితులకు భరోసాను కల్పించారు. అర్ధరాత్రి దాటే అంతవరకు అనేక ప్రాంతాల్లో కలియ జరిగిన చంద్రబాబు నాయుడు బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను దగ్గరుండి అందించారు. మళ్లీ సోమవారం ఉదయం కూడా వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు వరద బాధితులతో మాట్లాడుతూ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులకు అందించేందుకు అవసరమైన ఆ లక్ష ప్యాకెట్ల ఆహారాన్ని సిద్ధం చేసేలా ఇప్పటికే ఆయన అక్షయపాత్రకు చెందిన అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. ఆయా ఆహార పదార్థాలను బాధితులకు అందించే ఏర్పాట్లను సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వరద బాధితులకు సహాయ సహకారాలను అందించేందుకు అనుగుణంగా బృందాలను పంపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను చంద్రబాబు నాయుడు కోరారు. చంద్రబాబు నాయుడు కోరుకు మేరకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాయి. అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు బృందాలు వెళ్ళనున్నాయి. ఆర్మీ విమానంలో ఈ ప్రత్యేక బృందాలు చేరుకున్నట్లు చెబుతున్నారు. వందమందితో బృందం విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడ నుంచి హెలికాప్టర్లో విజయవాడ వరద ప్రాంతాలకు బృందాలు వేళలు ఉన్నాయి. 

బాధితులకు భరోసా కల్పిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు 

నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉదయం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం ఆ తర్వాత సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లారు. బోటులో వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టరేట్కు వచ్చి మరో మారు సమీక్ష నిర్వహించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆ తర్వాత మరోసారి కృష్ణలంక, జక్కంపూడి తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున చేపట్టిన పునరావాస్య కార్యక్రమాలు, ఆహార పంపిణీపై ఆరా తీశారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

హెలిక్యాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై మరోసారి ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. మూడు పూటలా బాధితులకు ఆహారం అందించాలని స్పష్టం చేశారు. చిన్నారులు, గర్భిణీలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలన్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూరు ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మధ్యాహ్నం కొంతమేరకు వరద ప్రభావం తగ్గుతుందని అంచనా వేశారు. లంక గ్రామాలలో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్లు తమకున్న అధికారాలను వినియోగించుకొని చర్యలు చేపట్టాలని సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్