వర్షాలు, వరదలపై దుష్ప్రచారం వద్దు.. కఠిన చర్యలు తప్పవన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, కురుస్తున్న వర్షాలు, చేపడుతున్న సహాయక కార్యక్రమాలకు సంబంధించి వివరాల గురించి ఆయన ఆరా తీశారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు అధికారులతో వర్షాలపై తాజా పరిస్థితిని అధికారులతో చర్చించారు.

Chief Minister Nara Chandrababu Naidu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 

రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, కురుస్తున్న వర్షాలు, చేపడుతున్న సహాయక కార్యక్రమాలకు సంబంధించి వివరాల గురించి ఆయన ఆరా తీశారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు అధికారులతో వర్షాలపై తాజా పరిస్థితిని అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ వర్షపాతం నమోదయింది అన్నారు. విజయవాడ, గుంటూరులో వెంటనే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వర్షాలు వరదల నేపథ్యంలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకునే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. విజయవాడలో కొండ చరియలు పడి చనిపోవడం బాధాకరమన్నారు. వరదల వల్ల 9 మంది చనిపోయారని, ఒకరు గల్లంతయినట్లు సీఎం వివరించారు. కాజా, టోలెట్, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో గరిష్టంగా 32.3 సెంటీ మీటర్లు, 32.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందన్న చంద్రబాబు.. జగ్గయ్యపేటలో 26.1 సెంటీమీటర్లు వర్షపాతం, తిరువూరులో 26 సెంటీమీటర్లు, గుంటూరులో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. కొన్నిచోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆదేశించామన్నారు. అధికారులు కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని మానిటర్ చేయడం వలన ప్రాణ నష్టం అధికం కాకుండా చూడగలిగామని వివరించారు.  వరదలతో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. భారీ వర్షాలతో అన్ని జలాశయాలు నిండిపోయాయన్నారు. 

ప్రజలను కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యం 

ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి, పొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. పులిచింతల నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా వస్తోందని, ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. బుడమేరు వల్ల వీటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తి ఆగిందని, ప్రకాశం బ్యారేజీ కింద పలుచోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయన్నారు. గట్లు బలహీనంగా ఉన్నచోట్ల ఇసుక బస్తాలు వేసుకున్నట్లు సీఎం వెల్లడించారు. వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 107 క్యాంపులు పెట్టినట్లు సీఎం వివరించారు. 17 వేల మందిని క్యాంపులకు తరలించినట్లు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వరద ముంపు ప్రాంతాలకు బోట్లు పంపించినట్లు వెల్లడించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడకక్కడ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ తక్షణ కర్తవ్యం అని పేర్కొన్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా సత్వర చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వరద ప్రాంతాల్లో బియ్యం, పప్పు, నూనె, పంచదార, కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మత్స్యకారుల కుటుంబానికి 50 కిలోలు బియ్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. సాధారణ పరిస్థితి నెలకొనే వరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్