కాఫీ, టీ తాగడం వల్ల క్యాన్సర్ మహమ్మారికి చెక్ చెప్పవచ్చు అని ఈ అమెరికా అధ్యయనం పేర్కొంది. తరచుగా అవకాశం ఉన్న ప్రతిసారి టీతోపాటు కాఫీలు కూడా తాగడం మంచిదని ఈ పరిశోధన చేసిన నిపుణులు పేర్కొంటున్నారు. కాఫీ, టీ తాగే వారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయని ఈ పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా నోటి, గొంతు, స్వర పేటిక క్యాన్సర్లను సైతం టీ, కాఫీలు అరికట్టే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఈ అధ్యాయానికి సంబంధించిన పలు విషయాలను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ క్యాన్సర్ అనే జర్నల్లో ప్రచురించింది.
ప్రతికాత్మక చిత్రం
ప్రతిరోజు ఉదయం లేవగానే టీ, కాఫీ తాగనిదే చాలామందికి రోజు ప్రారంభం కాదు. కొందరైతే రోజులో రెండు, మూడు సార్లు అయినా వీటిలో ఏదో ఒకటి తాగుతూ ఉంటారు. ఎక్కువగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వ్యాప్తి చెందుతాయన్న అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే, ఈ అభిప్రాయాలు తప్పు అన్న రీతిలో అమెరికాలోని ఒక అధ్యయనం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. కాఫీ, టీ తాగడం వల్ల క్యాన్సర్ మహమ్మారికి చెక్ చెప్పవచ్చు అని ఈ అమెరికా అధ్యయనం పేర్కొంది. తరచుగా అవకాశం ఉన్న ప్రతిసారి టీతోపాటు కాఫీలు కూడా తాగడం మంచిదని ఈ పరిశోధన చేసిన నిపుణులు పేర్కొంటున్నారు. కాఫీ, టీ తాగే వారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయని ఈ పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా నోటి, గొంతు, స్వర పేటిక క్యాన్సర్లను సైతం టీ, కాఫీలు అరికట్టే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఈ అధ్యాయానికి సంబంధించిన పలు విషయాలను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ క్యాన్సర్ అనే జర్నల్లో ప్రచురించింది. మొత్తం 14 అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని దీనిలో పొందుపరిచింది. ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడిమాలజీ కన్సార్టియం ఈ అధ్యయనాలను నిర్వహించింది. మొత్తంగా 9,500 మంది తల, మెడ క్యాన్సర్ రోగులను పరీక్షించడంతోపాటు క్యాన్సర్ నుంచి బయటపడిన 15,700 మందిని సైతం అధ్యయనం చేసింది. నిత్యం కాఫీ, టీలు తీసుకుంటున్న వారిలో మెడ, తల క్యాన్సర్ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
ఈ అధ్యయనాన్ని భిన్న మార్గాలను అనుసరించి నిర్వహించారు. కొన్ని రోజులపాటు క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులపైన ఈ అధ్యయనాన్ని నిర్వహించి అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నివేదికను ప్రచురించారు. అసలు కాఫీ తాగని వారితో పోల్చుకుంటే రోజుకు నాలుగు కప్పుల కాఫీ తీసుకునే వారిలో 17 శాతం క్యాన్సర్ కారకాలు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. రోజు ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకునే వారిలో నోటి క్యాన్సర్ లక్షణాలు 30 శాతం తక్కువగా ఉంటే, గొంతు క్యాన్సర్ కారకాలు 22 శాతం తక్కువగా ఉన్నాయి. నిత్యం మూడు, నాలుగు కప్పుల కాఫీ తాగే వారికి గొంతు కింది భాగంలో వచ్చే హైపో ఫారిన్జిల్ క్యాన్సర్ లక్షణాలు 40 ఒక శాతం తక్కువగా ఉంటాయి. రోజుకు ఒక్క కప్పు అయినా టీ తాగే వారిలో తొమ్మిది శాతం తల, మెడ క్యాన్సర్ కారకాలు తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అదే పనిగా టీ తాగినా ఇబ్బందులు తప్పవని అధ్యయనం వెల్లడించింది. ఎక్కువ మోతాదులో టీ తాగే వారిలో హైపో పారింజిల్ క్యాన్సర్ లక్షణాలు 38 శాతం ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. ఈ అధ్యయనం ప్రస్తుతం టీ, కాఫీ తాగే వారిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు టీ, కాఫీలను ఎక్కువగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయన్న భావన సర్వత్ర ఉంది. తాజాగా వెల్లడించిన ఈ అధ్యయనం కాఫీ, టీ వల్ల క్యాన్సర్ కు చెక్ చెప్పవచ్చని తేల్చడంతో కాఫీ, టీ ప్రియులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.