మాత్రతో ఇన్సులిన్ ఇంజక్షన్ కు చెక్.. టాబ్లెట్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కోట్లకు చేరింది. కోట్లాదిమంది ఇన్సులిన్ తీసుకుంటేనే గాని జీవనం సాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఇన్సులిన్ తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకే ఒక్క మాటతో ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేయవచ్చు. ఈ మాత్రను మస్సాచుసైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

taking insulin

ఇన్సులిన్ తీసుకుంటున్న దృశ్యం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కోట్లకు చేరింది. కోట్లాదిమంది ఇన్సులిన్ తీసుకుంటేనే గాని జీవనం సాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఇన్సులిన్ తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకే ఒక్క మాటతో ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేయవచ్చు. ఈ మాత్రను మస్సాచుసైట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సూక్ష్మ సూదుల అవసరం లేకుండా మన కడుపులోకి, పేగుల్లోకి ఔషధాన్ని ప్రవేశపెట్టగలిగే టాబ్లెట్స్ ను  ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ట్రయల్స్ పూర్తయి ఈ క్యాప్సూల్స్ అందుబాటులోకి వస్తే నిత్యం పొట్ట భాగంలో ఇన్సులిన్ ఇంజక్షన్లు చేసుకోవాల్సిన మధుమేహ బాధితులు, అదే రీతిలో నిత్యం ఇంజక్షన్లు చేసుకోవాల్సిన వారికి ఎంతో ఉపయోగపడనున్నాయి. నిజానికి ఇలా ఇన్సులిన్ తరహా ఔషధాలను నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఔషధం మన ఆహార నాళాలకు తగలకుండా కడుపులోకి చేరి పనిచేసేలోగా చాలా రసాయనిక మార్పులకు గురవుతుంది. అందుకే వాటిని తప్పనిసరిగా ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. అలా కాకుండా వాటిని కూడా నోటి ద్వారా తీసుకునే వీలు కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి తోచిన ఆలోచన.

జీర్ణ రసాలకు ప్రభావితం కానీ విధంగా ఔషధాన్ని గుళికల్లో ఉంచి, వాటిని నోటి ద్వారా శరీరంలోకి పంపి, ఆ టాబ్లెట్స్ కు ఉన్న అతి సన్నని సూదులు ద్వారా మందు విడుదల చేసేలా చూడడం. ఆ సూదులు కడుపు గోడలోకి చొచ్చుకుపోయి మందును విడుదల చేస్తాయి. అంటే బయటి నుంచి ఇంజక్షన్ చేయడానికి బదులుగా కడుపు లోపల ఇంజక్షన్ చేయడం అన్నమాట. అలా కడుపు లోపల సైతం సూదులు ఉపయోగించకుండానే మందును మన కడుపు గోడల్లోకి విడుదల చేయడానికి ఎంఐటి శాస్త్రజ్ఞులు స్క్విడ్ గమన విధానాన్ని అధ్యయనం చేశారు. దాని ఆధారంగా వారు రెండు రకాల క్యాప్సూల్స్ ను రూపొందించారు. వాటిలో ఎలాంటి సూక్ష్మ సూదులు ఉండవు. అవి మందును ఒక ధారలాగా కడుపు గోడలోకి చొచ్చుకుపోయేంత వేగంగా స్ప్రే చేస్తాయి. ఈ రెండు క్యాప్సూల్స్ లో ఒకటి బ్లూబెర్రీ ఆకారంలో ఉంటే, మరొకటి ట్యాబ్ ఆకారంలో ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా శాస్త్రజ్ఞులు ఈ క్యాప్సూల్స్ ద్వారా పందులు, కుక్కలు కడుపు భాగంలోకి ఇన్సులిన్ ను, జన్యు చికిత్సలో భాగంగా కొన్ని రకాల ఆర్ఎన్ఏలను విజయవంతంగా ప్రవేశపెట్టగలిగారు. మనుషులపై పరీక్షలు విజయవంతమై ఈ క్యాప్సూల్స్ మార్కెట్లోకి వస్తే మధుమేహ బాధితులకు ఇంజక్షన్ల బెడద తప్పనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన తదుపరి పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్