ఏటా రెండు ఇంజక్షన్లతో ఎయిడ్స్ కు చెక్.. దక్షిణాఫ్రికా, ఉగాండాలో ట్రయల్స్

ఎయిడ్స్ మహమ్మారిపై విజయం సాధించే దిశగా అనేక పరిశోధనలు సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న ఈ మహమ్మారిపై విజయం సాధించే దిశగా ఒక పరిశోధన తాజాగా జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా రెండు ఇంజక్షన్లు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా తయారుచేసిన లెనాకాపవిర్ ఇంజక్షన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఏటా రెండుసార్లు ఈ ఇంజక్షన్ తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ వైరస్ కు చెక్ పెట్టవచ్చు.

Lenacapavir injection

లెనాకాపవిర్ ఇంజక్షన్

ఎయిడ్స్ మహమ్మారిపై విజయం సాధించే దిశగా అనేక పరిశోధనలు సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న ఈ మహమ్మారిపై విజయం సాధించే దిశగా ఒక పరిశోధన తాజాగా జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా రెండు ఇంజక్షన్లు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా తయారుచేసిన లెనాకాపవిర్ ఇంజక్షన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఏటా రెండుసార్లు ఈ ఇంజక్షన్ తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ వైరస్ కు చెక్ పెట్టవచ్చు. నిజానికి హెచ్ఐవి నిరోధించే రెండు రకాల మాత్రలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి  మొదటిది 2012లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డిఏ అనుమతి పొందిన ట్రువాడ మాత్ర. రెండోది 2016లో అందుబాటులోకి వచ్చిన డెస్కోవి. ఈ రెండింటితో పోలిస్తే క్లినికల్ ట్రయల్స్ లో ఈ ఇంజక్షన్ నూటికి నూరు శాతం విజయవంతం కావడం గమనార్హం. హెచ్ఐవి క్యాప్సిడ్ (వైరస్ చుట్టూ ఉండే ప్రోటీన్లతో కూడిన రక్షణ పొర)ను ధ్వంసం చేయడం ద్వారా వైరస్ తన సంఖ్యను పెంచుకోకుండా చేస్తుంది. 

ఆఫ్రికా దేశాల్లో చాలామంది మహిళలు అత్యాచారాలకు గురై ఎయిడ్స్ బారిన పడుతున్న నేపథ్యంలో ఈ ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్ ను సౌతాఫ్రికాలోని 25 ప్రాంతాల్లో, ఉగాండాలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించారు. ట్రయల్స్ లో భాగంగా 5 వేల మంది మహిళలను ఎంచుకొని వారిని మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలోని 2,134 మంది మహిళలకు ఇంజక్షన్ ఇచ్చారు. రెండో కేటగిరీలోని 1068 మందికి ట్రువాడ, 2136 మందికి డెస్కోవి మాత్రలు ఇచ్చారు. వీరిలో ట్రువాడ మాత్ర తీసుకొన్న వారిలో 16 మందికి, డెస్కోవి మాత్ర తీసుకున్న వారిలో 39 మందికి ట్రయల్స్ సమయంలో హెచ్ఐవి సోకింది. లెనాకాపవిర్ ఇంజక్షన్ తీసుకున్న 2,134 మందిలో ఒక్కరికి కూడా హెచ్ఐవి సోకలేదు. అంటే 100 శాతం సక్సెస్ రేటుతో ఈ పరిశోధన విజయం సాధించింది. ఎయిడ్స్ కారక హ్యూమన్ ఇమ్యునో వైరస్ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని తేలింది. ట్రువాడ, డెస్కోవి మాత్రలను అభివృద్ధి చేసిన అమెరికన్ ఫార్మా దిగ్గం విలియం గిలియేడ్ సైన్సెస్ సంస్థ ఈ లెనాకాపవిర్ ఇంజక్షన్ ను అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణాఫ్రికా, ఉగాండా దేశాల్లోని ఔషధ నియంత్రణ సంస్థలకు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించనున్నట్లు గిలియేడ్ సైన్సెస్ సంస్థ వెల్లడించింది. ఈ ఔషధం అందరికీ అందుబాటులోకి ఉండేలా తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో గిలియేడ్ సైన్సెస్ సంస్థ.. జనరిక్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీలకు దీనికి సంబంధించిన లైసెన్సులను ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంటే ఆయా ఫార్మా కంపెనీలు కూడా ఈ ఔషధాన్ని తయారు చేస్తాయి. తద్వారా ఇది ఎక్కువగా అందుబాటులోకి వచ్చి ధర తగ్గుతుంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ ఔషధాన్ని విరివిగా కొనుగోలు చేసి హెచ్ఐవి నుంచి రక్షణ పొందాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆ సంస్థ కోరింది. కాగా హెచ్ఐవి చికిత్స నిమిత్తం ఈ డ్రగ్స్ కు ఎఫ్డిఏ 2022లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్