గూగుల్ సెర్చ్ యుఆర్ఎల్ లో మార్పులు.. యూజర్లపై ఇటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటే.!

ప్రస్తుతం మనిషికి ఏదైనా విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగితే చాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆశ్రయించేది గూగుల్. అటువంటి గూగుల్ ను ఒక్క భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కోట్లాదిమంది వినియోగిస్తున్నారు. మనం వెళ్లే ప్రాంతం నుంచి మనం తినాలనుకునే హోటల్ వరకు అన్ని గూగుల్లోనే సెర్చ్ చేస్తుంటారు. లొకేషన్ ఆధారంగా రిజల్ట్స్ చూపించే ఎబిలిటీతో గూగుల్ టాప్ లోకి వెళ్ళింది. అయితే ఈ కంపెనీ ఇటీవల సెర్చ్ డొమైన్ పనిచేసే విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సెర్చ్ యుఆర్ఎల్ మారబోతోంది. అయితే ఇండియన్ యూజర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్న భరోసా మాత్రం నిపుణుల నుంచి వినిపిస్తోంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం మనిషికి ఏదైనా విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగితే చాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆశ్రయించేది గూగుల్. అటువంటి గూగుల్ ను ఒక్క భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కోట్లాదిమంది వినియోగిస్తున్నారు. మనం వెళ్లే ప్రాంతం నుంచి మనం తినాలనుకునే హోటల్ వరకు అన్ని గూగుల్లోనే సెర్చ్ చేస్తుంటారు. లొకేషన్ ఆధారంగా రిజల్ట్స్ చూపించే ఎబిలిటీతో గూగుల్ టాప్ లోకి వెళ్ళింది. అయితే ఈ కంపెనీ ఇటీవల సెర్చ్ డొమైన్ పనిచేసే విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సెర్చ్ యుఆర్ఎల్ మారబోతోంది. అయితే ఇండియన్ యూజర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్న భరోసా మాత్రం నిపుణుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటివరకు లోకల్ సెర్చ్ రిజల్ట్ అందించేందుకు గూగుల్ కంట్రీ కోడ్ టాప్ లెవెల్ డొమైన్స్ (ccTLDs) గా పేర్కొనే కంట్రీ స్పెసిఫిక్ డొమైన్స్ ను ఉపయోగించింది. ఉదాహరణకు భారతదేశంలోని వినియోగదారులు google.co.in ను యాక్సెస్ చేశారు. అదే నైజీరియన్స్ అయితే google.ng, బ్రెజిల్ అయితే google.com.br వంటి యు ఆర్ ఎస్ ను ఉపయోగిస్తూ వస్తున్నారు. వివిధ దేశాల్లో వివిధ రకాల యుఆర్ఎల్ వినియోగిస్తూ తమ అవసరాలను వినియోగదారులు తీర్చుకుంటున్నారు. అయితే, ఈ యు ఆర్ ఎస్ లో కొన్ని మార్పులను ప్రస్తుతం గూగుల్ చేయబోతోంది. ఈ డొమైన్స్ గూగుల్ సెర్చ్ రిజల్ట్ తగ్గట్టుగా మారుస్తూ, రిజల్ట్ గా ఉండేలా చేయిస్తున్నాయి. ఈ కంట్రీ స్పెసిఫిక్ డొమైన్స్ దశల వారీగా తీసేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. అన్ని సెర్చ్ లను మెయిన్ డొమైన్ google.com కి రీ డైరెక్ట్ చేస్తామని గూగుల్ రెండు రోజుల కిందట ప్రకటించింది.

ఈ ప్రకటనతో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. తాజా ప్రకటన వల్ల ఇండియాలోని యూజర్లు google.co.in ను విజిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గూగుల్ google.com కి రీ డైరెక్టు అవుతుంది. అందరికీ సెర్చ్ ఎక్స్పీరియన్స్ ను సింప్లిఫై చేయాలనే ఉద్దేశంలో భాగంగానే గూగుల్ ఈ మార్పులు తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇది వినియోగదారులకు సులభతరంగా పనిచేసేందుకు అవకాశాన్ని కల్పిస్తుందని చెబుతున్నారు. సెర్చ్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకునే ప్రక్రియలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. కంట్రీ స్పెసిఫిక్ డొమైన్స్ ఇకపై అవసరం లేదని గూగుల్ పేర్కొంది. 2017 నుంచి google.com లేదా కంట్రీ స్పెసిఫిక్ డొమైన్ ఉపయోగించిన, రియల్ టైం లొకేషన్ ఆధారంగా గూగుల్ లోకలైజడ్ రిజల్ట్ అందిస్తోంది. కొత్తగా తీసుకువచ్చిన ఈ మార్పులు కారణంగా ఇకపై స్పెషల్ కంట్రీ డొమైన్స్ అవసరం లేదు. డొమైన్స్ మారినా సరే గూగుల్ రిజల్ట్స్ లో ఎలాంటి మార్పులు రావు లొకేషన్ కు రెలవెంట్ గానే సెర్చ్ రిజల్ట్ ఉంటాయి లోకల్ క్లినిక్ రెస్టారెంట్లు లేదా న్యూస్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఎప్పటి మాదిరిగానే పనిచేస్తుంది. అయితే బ్రౌజర్ అడ్రస్ బార్ లో google.co.in కి బదులుగా google.com అని మాత్రమే ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్