ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కోట్లలో ఉంది. ఎవరికైనా మెసేజ్ పెట్టాలంటే వాట్సాప్ నే అధికంగా వినియోగిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా సమాచారం మార్పిడిలో అత్యంత కీలకంగా వాట్సాప్ ఉంటుంది. అందుకే వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య 100 కోట్లు ఉంది. అయితే వాట్సప్ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేస్తూ వారి మనసును గెలుచుకుంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తూ మెరుగైన అనుభవాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ లాంటి అంశాలను స్టేటస్ లో షేర్ చేసుకునే సౌలభ్యం ఉంది.
వాట్సాప్ స్టేటస్
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కోట్లలో ఉంది. ఎవరికైనా మెసేజ్ పెట్టాలంటే వాట్సాప్ నే అధికంగా వినియోగిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా సమాచారం మార్పిడిలో అత్యంత కీలకంగా వాట్సాప్ ఉంటుంది. అందుకే వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య 100 కోట్లు ఉంది. అయితే వాట్సప్ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేస్తూ వారి మనసును గెలుచుకుంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తూ మెరుగైన అనుభవాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ లాంటి అంశాలను స్టేటస్ లో షేర్ చేసుకునే సౌలభ్యం ఉంది. దీనికి మరో అదనపు ఫీచర్ ను జోడించింది వాట్సాప్ యాజమాన్యం. ఇప్పటివరకు స్టేటస్ లో ఒక్కసారి పోస్ట్ చేయదగిన వీడియో నిడివి 60 సెకండ్లు మాత్రమే ఉంటూ వస్తుంది. కానీ, WABetalnfo ఫ్యూచర్ లీక్ చేసే ప్రసిద్ధ వెబ్సైట్ చెప్పిన దాని ప్రకారం వీడియోనిడివి 90 సెకండ్లకు పెరిగే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బీటా టెస్టింగ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
దీనివల్ల ఇకపై స్టేటస్ లో ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన వీడియోలను పెట్టుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది వీడియో కంటెంట్నే ఎక్కువగా చూస్తున్నారు. ఇంస్టాగ్రామ్, రీల్స్, యూట్యూబ్ షార్టలు, ఫేస్బుక్ స్టోరీస్ అన్ని చిన్న వీడియోలు వినియోగం పెరుగుతోంది. అందుకే ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. సరి కొత్తగా వస్తున్న ఈ ఫ్యూచర్ వల్ల 90 సెకండ్ లతో క్యాప్చర్ చేసి స్టేటస్ లో పెట్టుకోవచ్చు. ఇది ముఖ్యంగా స్మాల్ బిజినెస్ యూజర్లకు బాగా ఉపయోగపడే ఫీచర్గా చెబుతున్నారు. వీడియో నిడివి పెరగడమే కాదు ఇంకో ఆసక్తికరమైన అప్డేట్ కూడా ఉంది. స్టేటస్ లో మ్యూజిక్ ప్లే చేయగలిగే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా స్టేటస్కు మీరు నచ్చిన మ్యూజిక్ను యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం కొన్ని దేశాల్లో టెస్టింగ్ లో ఉంది. ఒక ఫోటో పెట్టి దానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవచ్చు. ఫీలింగ్స్, ఎమోషన్స్ మ్యూజిక్ ద్వారా బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి ఈ ఫీచర్ ఎక్కువమంది వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా సరికొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకొస్తుండడంతో వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వినియోగదారులను మరింత విరుగుగా వాట్సప్ వినియోగించేలా చేయడంలో ఈ సంస్థ సఫలం అవుతుంది.