రైల్వే శాఖ అసిస్టెంట్ లోకో పైలట్ కంప్యూటర్ ఆధారత పరీక్ష (స్టేజ్ 2) సవరించిన పరీక్ష తేదీలను తాజాగా ప్రకటించింది. మొదటి ప్రకటించిన దాని ప్రకారం మార్చి 19, 20 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా అసిస్టెంట్ లోకో పైలట్ (స్టేజ్ 2) పరీక్ష వాయిదా పడింది. సవరించిన తేదీలు ప్రకారం మే 2, ఆరు తేదీల్లో నిర్వహించనున్నారు. స్టేజ్ 2 పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను పొందాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధించిన సెంటర్ వివరాలు పరీక్షకు పది రోజులు ముందుగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ప్రతీకాత్మక చిత్రం
రైల్వే శాఖ అసిస్టెంట్ లోకో పైలట్ కంప్యూటర్ ఆధారత పరీక్ష (స్టేజ్ 2) సవరించిన పరీక్ష తేదీలను తాజాగా ప్రకటించింది. మొదటి ప్రకటించిన దాని ప్రకారం మార్చి 19, 20 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా అసిస్టెంట్ లోకో పైలట్ (స్టేజ్ 2) పరీక్ష వాయిదా పడింది. సవరించిన తేదీలు ప్రకారం మే 2, ఆరు తేదీల్లో నిర్వహించనున్నారు. స్టేజ్ 2 పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను పొందాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధించిన సెంటర్ వివరాలు పరీక్షకు పది రోజులు ముందుగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రైల్వే శాఖ అసిస్టెంట్ లోకో పైలట్ కంప్యూటర్ ఆధారత పరీక్షల ఫలితాలను, కట్ ఆఫ్ మార్కులను ఫిబ్రవరి 26న విడుదల చేసిన విషయం తెలిసిందే. స్టేజ్ 1 పరీక్ష రాసిన అభ్యర్థులను షార్ట్ లిస్టు చేయగా మొత్తం 1251 మంది స్టేజ్ 2 పరీక్షకు ఎంపికయ్యారు.
దేశవ్యాప్తంగా రైల్వే జోన్లలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏ ఎల్ పి) పోస్టుల భర్తీకి రైల్వే శాఖ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, అనూహ్యంగా ఈ పోస్టుల సంఖ్యను మూడు రేట్లు పెంచింది. దీంతో ఈ పోస్టుల సంఖ్య 18,799 కు చేరింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాధాన్యాల నమోదుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగాలుకు వయోపరిమితిని 30 నుంచి 33 ఏళ్లకు పెంచింది. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వేతనంగా చెల్లించనున్నారు. భారీ వేతనాలు అందిస్తుండడంతో అభ్యర్థులు భారీగానే దరఖాస్తు చేసుకున్నారు. ఇకపోతే స్టేజ్ 2 పరీక్ష 175 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు కలిపి 175 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్పు కేటాయిస్తారు. మొత్తం పరీక్షా సమయం 150 నిమిషాలు. ఇందులో పేపర్ 1 నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 45 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్రతి ప్రశ్నలు ఉంటాయి. పేపర్ వన్ పరీక్ష సమయం 90 నిమిషాలు. పేపర్ 2 పరీక్షలో సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్పు కేటాయిస్తారు. పేపర్ 2 పరీక్ష సమయం 60 నిమిషాలు. మారిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలను నిర్వహించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించుకోవాలని రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.