దేశంలోనే సంపన్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఏడిఆర్ నివేదిక వెల్లడి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) తాజా నివేదికను వెల్లడించింది. చంద్రబాబు కుటుంబానికి రూ.991 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏడిఆర్ గుర్తించింది. అదే సమయంలో ఆయనకు పది కోట్ల రూపాయల అప్పు ఉందని పేర్కొంది. ఈ జాబితాలో సీఎం చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో నిలిచారు.

Nara Chandrababu Naidu, Mamata Banerjee

నారా చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ 

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) తాజా నివేదికను వెల్లడించింది. చంద్రబాబు కుటుంబానికి రూ.991 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏడిఆర్ గుర్తించింది. అదే సమయంలో ఆయనకు పది కోట్ల రూపాయల అప్పు ఉందని పేర్కొంది. ఈ జాబితాలో సీఎం చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రుల ఆస్తులు వివరాలకు సంబంధించిన జాబితాను ఏడిఆర్ వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని ముఖ్యమంత్రులు అత్యంత తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు.

మమతా బెనర్జీ వద్ద 15 లక్షలు రూపాయలు ఆస్తి మాత్రమే ఉన్నట్లు ఏడిఆర్ పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు సంపద రూ.52.59 కోట్లుగా ఉందని నివేదిక వివరించింది. అంతేకాకుండా ముఖ్యమంత్రుల సగటు వ్యక్తిగత ఆదాయం రూ.13,64,310 గా ఉన్నట్లు ఈ నివేదిక వివరించింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం 31 మంది ముఖ్యమంత్రి సంపాదన రూ.1630 కోట్లు కాగా, రూ.332 కోట్ల సంపాదనతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు దానికి ముఖ్యమంత్రుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం అమర్ అబ్దుల్లా రూ.55 లక్షల సంపదతో వేద ముఖ్యమంత్రిగా జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. 13 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. హత్యాయత్నం, కిడ్నాప్, ముడుపులు, నేరపూరిత కొట్రలకు పాల్పడడం వంటి కేసులను పదిమంది ఎదుర్కొంటున్నట్లు ఏడిఆర్ నివేదిక వెల్లడించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్