టిడిపి ఎంపీలతో చంద్రబాబు భేటీ.. మంత్రివర్గంలో చేరడంపై చర్చ

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నూతనంగా గెలిచిన ఎంపీలతో సమావేశం అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు పలువురికి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.

Nara Chandrababu Naidu

నారా చంద్రబాబు నాయుడు 


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నూతనంగా గెలిచిన ఎంపీలతో సమావేశం అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు పలువురికి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి గెలిచిన ఎంపీలతో సమావేశమయ్యారు. ఎన్డీఏ సమావేశంలో చర్చించిన అంశాలు, ఎన్డీఏలో చేరడం ద్వారా రాష్ట్రానికి సమకూరనున్న ప్రయోజనాలు, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత వంటి అంశాలపై చంద్రబాబు నాయుడు చర్చించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి దక్కనున్న మంత్రి పదవులకు సంబంధించిన అంశంపైన చంద్రబాబు ఎంపీలతో చర్చించినట్లు తెలుస్తోంది. గడచిన ఐదేళ్లు పార్టీకి అండగా ఉన్న కొందరికి మంత్రి పదవులు దక్కనున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేద్దామని, బిజెపి ఎన్ని మంత్రి పదవులు ఇస్తే అన్ని తీసుకుందామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలుస్తోంది. బిజెపికి అవసరం ఉంది కదా అని డిమాండ్ చేసే పరిస్థితి వద్దన్న చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు అనుగుణంగా కేంద్రంతో సంబంధాలను కొనసాగించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎంపీలకు సూచించారు. ఈ సమావేశానికి నూతనంగా ఎంపికైన ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు గెలవడం గమనార్హం. తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు నలుగురికి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కునుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్