దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుంది. ఏట వివిధ డిగ్రీలు పట్టుకొని బయటకు వస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి నిరుద్యోగులకు శుభవార్తను అందించింది ఒక సంస్థ. కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఉద్యోగాన్ని అందిస్తోంది. 60 శాతం ఇంజనీరింగ్ విభాగంలోని బిఈ, బీటెక్, బీఎస్సీ / ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణులైన వారికి ఇది మంచి అవకాశం గా చెప్పవచ్చు. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులుగా ఆ సంస్థ పేర్కొంది.
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుంది. ఏట వివిధ డిగ్రీలు పట్టుకొని బయటకు వస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి నిరుద్యోగులకు శుభవార్తను అందించింది ఒక సంస్థ. కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఉద్యోగాన్ని అందిస్తోంది. 60 శాతం ఇంజనీరింగ్ విభాగంలోని బిఈ, బీటెక్, బీఎస్సీ / ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణులైన వారికి ఇది మంచి అవకాశం గా చెప్పవచ్చు. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులుగా ఆ సంస్థ పేర్కొంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలను ఆ సంస్థ భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆయా కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ముంబైలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది. మొత్తం పోస్టుల సంఖ్య 400. ఇందులో 396 ఖాళీలు కాగా, 4 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఇందులో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆయా ఖాళీలు మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పోస్టుల సంఖ్య చూస్తే మెకానికల్ విభాగంలో 150, కెమికల్ విభాగంలో 60, ఎలక్ట్రికల్ విభాగంలో 80, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 45, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో, సివిల్ విభాగంలో 45 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్ 10వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆయా కోర్సుల్లో 60 శాతం మార్పులతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఉండాల్సి ఉంది. ఇక వయసు విషయానికొస్తే 2025 ఏప్రిల్ 30వ తేదీ నాటికి 26 ఏళ్ల వయసు మించరాదు. నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయసు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు లభిస్తుంది. దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు లభించింది. ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియను గేట్ 2023/2024/2025 స్కోర్, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ కల్పిస్తారు. నెలకు 74000 చొప్పున స్టైఫండ్ అందిస్తారు. నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ https://npcilcareers.co.in/MainSiten/default.aspx సంప్రదించాలని సూచించింది.