గడిచిన కొద్దిరోజులుగా యూపీఐ లావాదేవీల పై జిఎస్టి విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నేపథ్యంలో యూపీఐ వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు 18 శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. యూపీఐ లావాదేవీలు పై ఎటువంటి జిఎస్టి విధించే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. గడిచిన కొద్ది రోజుల నుంచి రెండు వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే 18 శాతం జీఎస్టీ విధిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో యూపీఐ వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ లావాదేవీలపై ఎటువంటి జీఎస్టీలు విధించడం లేదని స్పష్టం చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
గడిచిన కొద్దిరోజులుగా యూపీఐ లావాదేవీల పై జిఎస్టి విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు నేపథ్యంలో యూపీఐ వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు 18 శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. యూపీఐ లావాదేవీలు పై ఎటువంటి జిఎస్టి విధించే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. గడిచిన కొద్ది రోజుల నుంచి రెండు వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే 18 శాతం జీఎస్టీ విధిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో యూపీఐ వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ లావాదేవీలపై ఎటువంటి జీఎస్టీలు విధించడం లేదని స్పష్టం చేసింది. రెండు వేల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవులు చేస్తే జీఎస్టీ విధిస్తారని కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉందని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఎటువంటి జిఎస్టి వివరించబోమని పేర్కొంది. గడిచిన రెండు వారాలుగా యూపీఐ వినియోగదారులకు సంబంధించి జిఎస్టి వసూలు చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. దీనిపై అధికారులు కూడా తమకు సమాచారం లేదని చెప్పడంతో ఈ ఆందోళన రెట్టింపు అయింది. ఈ ఆందోళన సామాజిక మాధ్యమాలో వేదికగా బహిర్గతం కావడంతో దాదాగా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. అటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేయడంతో కాస్త ఉపశమనం లభించినట్లు అయింది.
యూపీఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది జేబులో డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. టీ తాగిన దగ్గర్నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డబ్బు చెల్లించేంతవరకు ప్రతిచోట యుపిఐ వినియోగిస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ చేయడానికి వినియోగదారులు అలవాటుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం యుపిఐ చెల్లింపులు పై జిఎస్టి విధిస్తుందన్న వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా ఈ తరహా చెల్లింపులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటూ పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి యూపీఐ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఇటువంటి వార్తలపై ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాబట్టి యధావిధిగా యూపీఐ వినియోగదారులు తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చుని కేంద్రం స్పష్టం చేసింది. జీఎస్టీ వసూళ్లు అన్నది కొంతమంది సృష్టించిన అబూత కల్పనలు మాత్రమేనని కేంద్రం స్పష్టం చేయడంతో యూపీఐ వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.