కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం జమిలి ఎన్నికల దశగా అడుగులు వేస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావాలని బిజెపి ఎప్పటి నుంచో బలంగా ఆకాంక్షిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ విధానాన్ని అమలు చేయాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అమలు కాలేదు. కానీ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలీ ఎన్నికలు నిర్వహించాలని గట్టిపట్టుదలగా బిజెపి ఉంది. ఒకే దేశం - ఒకే ఎన్నికకు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తోందని మోడీ సర్కార్ ఆశాభావంతో ఉంది.
రాష్ట్రపతికి సిఫార్సులు అందిస్తున్న కోవింద్
కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం జమిలి ఎన్నికల దశగా అడుగులు వేస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావాలని బిజెపి ఎప్పటి నుంచో బలంగా ఆకాంక్షిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ విధానాన్ని అమలు చేయాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అమలు కాలేదు. కానీ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలీ ఎన్నికలు నిర్వహించాలని గట్టిపట్టుదలగా బిజెపి ఉంది. ఒకే దేశం - ఒకే ఎన్నికకు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తోందని మోడీ సర్కార్ ఆశాభావంతో ఉంది. ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం మూడోసారి అధికార పగ్గాలు చేపట్టి వందరోజులు పూర్తవుతుంది. పాలక కూటమిలో సమన్వయం అద్భుతంగా ఉందని, ఈ బంధం ఐదేళ్లు పటిష్టంగా కొనసాగుతుందని గట్టిగా భావిస్తోంది. జమిలి ఎన్నికలు ఈ టర్మ్ లోనే అమలవుతాయనీ, వాస్తవ రూపం దాల్చబోతుందని ప్రభుత్వంలోని కీలకంగా వ్యవహరించిన ఒక వ్యక్తి వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలకు బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల హామీ కూడా ఉంది. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సమాంతరంగా ఒకేసారి ఎన్నికలు జరపాలని, అవి పూర్తయిన 100 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారధ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఇప్పటికే సిఫార్సులు చేసింది. జాతీయ లా కమిషన్ కూడా 2029 నుంచి లోక్ సభ, అసెంబ్లీ, పంచాయతీలు/మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికల జరపాలని, ఒకవేళ త్రిశంకు సభ ఏర్పడితే లేదా అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాలు ఓడిపోతే ఐక్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనతో విడిగా ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తన సిఫార్సుల అమకుకు ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. జమిలి ఎన్నికలకు 18 రాజ్యాంగ సవరణలు సూచించింది. వీటిలో ఎక్కువ సవరణలకు రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అక్కర్లేదని వివరించింది.
ఇదిలా ఉంటే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2011లో చివరిసారిగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయింది. సాధారణంగా 10 ఏళ్లకు ఒకసారి దేశంలో జనాభాను లెక్కిస్తారు. దీని ప్రకారం 2021 లో జనాభాను లెక్కించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో ఇప్పుడు జనాభా లెక్కలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్న హాల్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. అదే సమయంలో కులాల వారీగా జన గణన చేపట్టడంపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సదరు డాక్యుమెంట్పై కులం కాలం పెట్టాలా అక్కర్లేదా.? అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కొన్ని, ఎన్డీయే పార్టీలు కూడా కుల గణన చేపట్టాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. జనాభా లెక్కలు వెల్లడైన తరువాత చట్ట సభల నియోజకవర్గాల పునర్విజన ప్రక్రియ జరుగుతుంది అని చెబుతున్నారు. ఇది పూర్తికాగానే లోక్ సభ, అసెంబ్లీలో మహిళలకు మూడోవంతు సీట్ల కేటాయింపు అమల్లోకి రానుంది. ప్రభుత్వ ద్వారా కాకుండా తమంత తాము జనగణన దరఖాస్తును నింపాలనుకునే పౌరులు ఎన్పిఆర్లో రిజిస్టర్ చేసుకోవచ్చు.